నూతన పెన్షన్లు పంపిణీ చేసిన‌ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

విశాఖ‌:  నూత‌నంగా మంజూరైన పింఛ‌న్ల‌ను ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ శుక్ర‌వారం పంపిణీ చేశారు. బుచ్చయ్యపేట మండలం కే పి అగ్రహారం గ్రామంలో నూతన మంజూరైన పెన్షన్లు ఇవాళ ఉదయం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీ కరణం ధర్మశ్రీ చేతులు మీదుగా పంపిణీ చేశారు.  కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గోపిశెట్టి శ్రీను, పంచాయతీ సెక్రెటరీ, డిజిటల్ అసిస్టెంట్ సుంకర పవన్ కుమార్, వెల్ఫేర్ అసిస్టెంట్ వరహాలు, వాలంటీర్లు, పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా ఇవాళ ఉద‌యం నుంచి వైయ‌స్ఆర్ పింఛను కానుక పంపిణీ ప్రారంభ‌మైంది. పింఛన్లను వాలంటీర్లు ఈనెల ఐదవతేదీ వరకు పంపిణీ చేస్తారు.
 

Back to Top