సీఎం వైయస్‌ జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌ 

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
 

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్రెండ్‌ సెట్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర బాగు కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. అసెంబ్లీలో లోకాయుక్త సవరణ బిల్లుపై కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా అవినీతి కనిపించిందని, అవినీతి నిరోధించడానికి సీఎం వైయస్‌ జగన్‌ లోకాయుక్త యాక్ట్‌ ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభివృద్ధి, సంక్షేమం గురించి రకరకాల బిల్లులు తీసుకువచ్చారని, అవినీతిని నిర్మూలించేందుకు రెండు బిల్లులు తీసుకువస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త సవరణ బిల్లు, జ్యుడిషియల్‌ రివ్యూ బిల్లులు తీసుకువచ్చారన్నారు. ఏదైనా పని చేయాలంటే దానికి మనస్సు ఉండాలని, మనస్సు ఉంటే మార్గం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్‌ కమిషనర్స్‌ను అపాయింట్‌ కూడా చేయలేదని, ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిటీ కూడా లాగి లాగి చేయనేలేదన్నారు. చివరకు మైనార్టీని మంత్రిగా కూడా చేయలేదన్నారు. కానీ, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగమించి ప్రజల కోసం అనేక పథకాలు చేపడుతున్నారన్నారు. భారతదేశంలో 771 జడ్జిలు, 308 అదనపు జడ్జిలు అవసరం ఉందన్నారు. కానీ మన దేశంలో 542 మంది జడ్జిలు, 134 అదనపు న్యాయమూర్తులు ఉన్నారన్నారు. ఖాళీలు నేటికీ 229 న్యాయమూర్తులు, 174 అదనపు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో 28 మంది న్యాయమూర్తులు, 9 మంది అదనపు న్యాయమూర్తులకు అవకాశం ఉందని, కానీ, 13 మందే న్యాయమూర్తులు ఉన్నారన్నారు. లోకాయుక్తకు న్యాయమూర్తులను తీసుకురావాలని యాక్ట్‌కు సవరణ తీసుకువచ్చారన్నారు. లోకాయుక్తను బలపర్చడం ద్వారా పరిపాలనను మరింత మెరుగుచేయవచ్చే ఉద్దేశంతో తీసుకువచ్చారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా మిగిలిపోతారన్నారు.

Back to Top