అణగారిన వర్గాల ఆశాజ్యోతి సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కళావతి
 

అసెంబ్లీ: ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని ఎమ్మెల్యే కళావతి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్‌ ఏర్పాటు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఆదివాసీల తరుఫున ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివాసీల దేవుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి  సీఎం జగనన్న రూపంలో ఉన్నాడని ప్రతీ గిరిజనుడు భావిస్తున్నారన్నారు. అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ గిరిజన శాఖ మంత్రిని కూడా ఒక మహిళకు కేటాయించారు. ఆం«ద్రరాష్ట్రంలో జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి వినూత్న పథకాలు రూపకల్పన చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, మేనిఫెస్టోలను అంశాలను అమలు చేస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు లక్షలాది ఉద్యోగాలు, ఇంకోవైపు నూతన చట్టాలు తీసుకువస్తున్నారు. వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో పాలన చేస్తూ ప్రభుత్వంలో అందరి పాత్ర ఉండాలని మహా ఆశయంతో అన్ని వర్గాల వారికి కార్పొరేషన్‌ నెలకొల్పడం జరిగింది.

వివక్షకు గురికాబడుతున్న అన్ని వర్గాల సమస్యలు సత్వరమే పరిష్కారం జరగాలని ఒక వజ్ర సంకల్పంతో గిరిజనుల కోసం కమిషన్‌ ఏర్పాటు చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్రంలో 89వ రాజ్యాంగ సవరణ 2003 చట్టం ప్రకారం 2004లో షెడ్యుల్డ్‌ ట్రైబల్స్‌కు ప్రత్యేక కమిషన్‌ ఏర్పడినా.. దానికి భౌగోళికం, సంస్కృతికపరంగా ఎస్సీ, ఎస్టీ సమస్యలు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసి గిరిజన పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకుంది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. అంబేడ్కర్‌ ఆశయాలు నిత్యం ప్రజల్లో నిలిచే విధంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా సీఎం వైయస్‌ జగన్‌ ఆచరణలో చూపిస్తున్నారని ఎమ్మెల్యే కళావతి వివరించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top