రైతు పక్షపాత ప్రభుత్వం ఇది

కాకాని గోవర్థన్ రెడ్డి

చంద్రబాబు ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ అన్నాడు. అధికారంలోకి వచ్చాడు. తర్వాత కలగన్నారా అన్నాడు. ఆ తర్వాత కుటుంబంలో ఒక్కరికే ఇస్తా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే ఇస్తా. లక్షా యాభై వేలిస్తా. 5 విడతలుగా ఇస్తా అన్నాడు. చివరకు మూడు విడతలు కూడా సక్రమంగా ఇవ్వకుండా వెళ్లిపోయాడు. ఇద్దరు నాయకుల పాలన గురించి తేడా గమనిస్తే - రైతులెప్పుడూ చంద్రబాబుకు వేయరు. ఎందుకంటే వర్షాలు పడవని. కానీ రైతు రుణమాఫీ అన్నాడు కదా చేస్తాడని వేసారు. కానీ అధికారంలోకి వచ్చాక బాబు రెండు వేళ్లు చూపించి, మూడు నామాలు పెట్టి వెళ్లిపోయాడు. అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు వైయస్సార్ రైతు భరోసా 4 విడతలుగా రూ.12,500 చొప్పున రూ.50000 ఇస్తామని చెప్పారు. దానికి మరో రూ.1000 పెంచి రూ.13,500 ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి మాట చెప్పి మోసగిస్తే, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పినదానికంటే ఎక్కువ ఇచ్చి తన ఘనత చాటుకున్నారు. నాలుగు విడతల్లో రూ.50,000 అన్న రైతుభరోసాను మరో విడత పొడిగించి 5 విడతలు చేసి, మొత్తం  రూ. 67,500 అందిస్తున్నారు.

రైతు కుటుంబాలకు చెందిన 4457732 మంది, కౌలు రైతులకు సంబంధించి 1,24,773 మంది మొత్తంగా 4582505 కుటుంబాలకు రూ.5230 కోట్ల రూపాయిలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.

ఓ వ్యక్తి ఏదైనా పని చేస్తే అది చరిత్రలో అజరామరంగా నిలిచిపోయేలా చేయాలి.  వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఓ పథకాన్ని ఆలోచన చేసారంటే అది గతంలో ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి గొప్ప ఆలోచనే అయ్యుంటుంది. భవిష్యత్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే వాటిని తీసివేసే ఆస్కారం లేనటువంటి పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ఇలాంటి గొప్ప పథకాలు ప్రవేశ పెట్టినందుకు అధికారపార్టీ శాసనసభా పక్ష నేతగా ఎంతగానో గర్విస్తున్నాను. రైతు పక్షపాత ప్రభుత్వం ఇది. చంద్రబాబు 2004కు ముందు అధికారంలో ఉన్నప్పుడు బంట్రోతుకైనా బిడ్డనిస్తాం గానీ రైతు కుటుంబానికి పిల్లనివ్వమని అనేటువంటి రోజులుండేవి. స్వయంగా చంద్రబాబే తన మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం శుద్ధ దండగ అని రాసుకున్నాడు. రాష్ట్రంలోని 70% రైతు కుటుంబాలు అల్లాడిపోయినటు వంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని సరిదిద్ది రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తర్వాత మరల వైయస్ జగన్ గారు రాజశేఖర్ రెడ్డిగారి పరిపాలన గుర్తుకు తెచ్చే విధంగా రైతులకు అండగా నిలుస్తున్నారు. ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చిన పాలన వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారిది. 

 
 
 
Back to Top