అమరావతి: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నారని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలిపారు. మహిళా సాధికారతపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నారని చెప్పారు. మహిళలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మహిళల రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. దిశా యాప్, మహిళా పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు సంఘాలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలకు సీఎం వైయస్ జగన్ రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించారని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఎన్నో పథకాలు అమలవుతున్నాయి.. అందుకు కారణం సీఎం వైయస్ జగన్ అన్నారు. మహిళల సాధికారత కోసం వైయస్ఆర్ సీపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడబిడ్డకు సీఎం వైయస్ జగన్ అండగా ఉన్నారని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కొనియాడారు. రాష్ట్రంలో మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తున్నారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.