జగనన్నను మ‌ళ్లీ ఆశీర్వదించండి

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అనంత‌పురం:  ప్ర‌తి ఇంటిలో పెద్ద కొడుకుగా ఉన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆశీర్వ‌దించాల‌ని ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి కోరారు. శింగనమల నియోజ‌క‌వ‌ర్గం బుక్కరాయసముద్రం మండలం, రోటరీపురం గ్రామం  ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఎమ్మెల్యే ప్ర‌తి ఇంటికీ వెళ్లి ప్ర‌భుత్వం అందించిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీ ఇంట్లో ఏ చిన్న సాయం జగనన్న ద్వారా అందినా ఎవరు మరిచి పోవద్దని అన్నారు. ఓటు వేసి ఆ రుణం తీర్చుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు. జగనన్న మళ్లీ సీఎం అయితేనే పేదవాళ్ల జీవితాలు మారుతాయని, వారి పిల్లలు మరింత ఉన్నతంగా రాణిస్తార‌ని తెలిపారు. మ‌ళ్లీ మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌పోతే ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయని నిరుద్యోగ సమస్య మళ్లీ తీవ్రతరం అవుతుందని అన్నారు.

ఈ సందర్భంగా ఈ గ్రామంలో జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారు తలారి లక్ష్మినారాయణ ఇంటికి వెళ్లారు. కుటుంబానికి జగనన్న అందించిన సంక్షేమ పథకాల వివరాలను పేరుపేరునా చెప్పారు.

జగనన్న విద్యా దీవెన ద్వారా..... రూ.12,500
జగనన్న అమ్మ ఒడి ద్వారా.....
రూ.29,000
వైయస్ఆర్‌ సున్నా వడ్డీ (రైతులు) ద్వారా..... రూ.5,448
వైయస్ఆర్‌ పంటల భీమా ద్వారా..... రూ.23,760
వైయస్ఆర్‌ ఆసరా ద్వారా.....రూ.58,738
వైయస్ఆర్‌ పించన్ కానుక ద్వారా.....రూ.82,000
వైయస్ఆర్‌ సున్నా వడ్డీ (డ్వాక్రా) ద్వారా.....రూ.9,489
ఇంటి స్థలం ద్వారా.....రూ.2,00,000
ఇల్లు.....రూ.2,50,000

మొత్తం చేకూరిన లబ్ధి రూ.6,70,935 ఆరు లక్షల డేబై వేలా తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు వివరించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారు తలారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జగనన్న సంక్షేమ పథకాలు అన్ని క్రమం తప్పకుండా అందుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ,జడ్పీటీసీ,సింగిల్ విండో ప్రెసిడెంట్, ఎంపీటీసీలు,సర్పంచులు మండల కన్వీనర్, నాయకులు మరియు కార్యకర్తలు  పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top