వైయస్‌ జగన్‌ పాలనతో చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌

అశోక్‌బాబు అరెస్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం?
 
420 పని చేసిన వ్యక్తిని చంద్రబాబు ఎలా సమర్ధిస్తారు?

తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్పా?

అమ్మ ఒడి పేరిట తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు

చంద్ర‌బాబు బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే వాళ్లం కాదు

ఇక్క‌డ ఉండేది ఓ వీరుడు, ధీశాలి నాయ‌క‌త్వంలో ప‌ని చేసే వైయ‌స్ఆర్‌సీపీ కొద‌మ సింహాలు

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న పరిపాలనను చూసి రెండున్నరేళ్లుగా చంద్రబాబుకు నిద్రపట్టడం లేదని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్‌ పేర్కొన్నారు. తాను 14ఏళ్లు సీఎంగా ఉండి చేయలేని పనులు ఇవాళ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తుండటంతో చంద్రబాబుకు నిద్రకరువైందన్నారు. తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్పా? అని ప్రతిపక్ష నేతను నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టుకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.  తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడారు.

అశోక్‌బాబు డిగ్రీపై సహోద్యోగులు ఫిర్యాదు చేశారు. సహోద్యోగుల ఫిర్యాదుతో ఆయనపై కేసు పెట్టారు. తప్పుడు సర్టిఫెకేట్లతో పదోన్నతి పొందిన వ్యక్తిని సమర్థిస్తారా?. అశోక్‌ బాబు చేసిన పని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.  అశోక్‌బాబు తప్పు చేశారని నిర్ధారణ అయిన తరువాత సీఐడీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఇది ఒక సాధారణ క్రమంలో జరిగే పరిణామాలు.

ఈ అంశాన్ని నిన్నటి నుంచి నారా చంద్రబాబు అండ్‌ కో నానా యాగీ చేస్తోంది. దీనికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, వైయస్‌ జగన్‌కు ఏం సంబంధం. ఒక 420 పని చేసిన వ్యక్తిని ప్రజలు, మేధావులు, పాత్రికేయులు ఎలా సమర్ధిస్తారు. చేసింది ఒక వెధవ పని, తప్పుడు పని, 420 కన్నా ఘోరమైన పని చేశాడు. ఇది చంద్రబాబుకు తెలియడం లేదా? చంద్రబాబు 420 అయినంత మాత్రానా, అశోక్‌బాబు 420 అయినంత మాత్రానా, టీడీపీ 420 అయినంత మాత్రానా ఎవరిని బెదిరిస్తారు. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.

 చంద్రబాబు విచిత్రంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ గుండెల్లో నిద్రపోతారట?. చంద్రబాబు నిద్రపోతున్నాడని మేం అనుకోవడం లేదు. చంద్రబాబు నిద్రపోడు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఈ రెండున్నరేళ్లుగా నిద్రపోలేదు. 14 ఏళ్లు తాను చేయలేని పనులు ఒక వీరుడు, ధీశాలీ వైయస్‌ జగన్‌ ఇన్ని పథకాలు చేస్తున్నారని, ఇన్ని కోట్ల మంది ప్రజల హృదయాల్లో శభాష్‌ అనిపించుకుంటున్నాడని చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు.

49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పిల్లల చదువుల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. 50 లక్షల మంది రైతులకు నేరుగా రైతు భరోసా కింద డబ్బులు జమ చేస్తున్నారు. ఇక చంద్రబాబుకు ఎందుకు నిద్రపడుతుంది?.
26లక్షల మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ చేయూత పథకం కింద డబ్బులు ఇస్తున్నారు. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరు మీద నేరుగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇది చూసి చంద్రబాబుకు నిద్రపట్టదు. నీవు ఎవరి గుండెల్లో నిద్రపోలేడు.  వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి నారా చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదు.

తప్పు చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం తప్పా?. నిన్నటి నుంచి టీడీపీ నేతలు మాట్లాడతున్న భాష ప్రభుత్వానికి సంబంధమా? వైయస్‌ జగన్‌కు సంబంధమా?  అశోక్‌ బాబు అనే వ్యక్తి దొంగ సర్టిఫికెట్లతో పదోన్నతి పొంది ప్రభుత్వాన్ని మోసం చేస్తే అతన్ని అరెస్టు చేయడం తప్పా? నీకు మాత్ర తప్పు కాకపోవచ్చు చంద్రబాబు. ఎందుకంటే ఆ గ్యాంగ్‌కు లీడర్‌ కాబట్టీ. 420 పదానికి చంద్రబాబు తీసిపోడు. చంద్రబాబు మోసగాడు కాబట్టే ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీని సైతం లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి చేసి చావుకు కారణమయ్యాడు. ఎన్టీఆర్‌ మరణానికి ఈ దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు చంద్రబాబు కాబట్టే ఆయన్ను చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించారు. 

ఇవాళ  చంద్రబాబు రుబాబు చేసినంత మాత్రనా ఎవరూ బెదరరు. ఇక్కడ ఒక వీరుడు, ధీశాలీ నాయకత్వంలో పని చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కొదమ సింహాలు ఉన్నాయి. ఎవరూ భయపడరు. బొచ్చు పీకుతారా అంటూ వల్గర్‌గా మాట్లాడుతున్నారు. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి పీకి పారేశారు కదా? ఇంకేం కావాలి. కాలగర్భంలో కలిసిపోయిన మీరు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి ఇంకా కొంత మందికి ఇవ్వమని అడగండి. సంక్షేమ పథకాలు ఇంకా పెంచాలని ప్రతిపక్షానికి ఎమ్మెల్యే జోగి రమేష్‌ హితవు పలికారు.
 

Back to Top