చంద్రబాబు ఓ గూండా

ఎమ్మెల్యే జోగి రమేష్‌

తనపై టీడీపీ గూండాలు రాళ్ల దాడికి పాల్పడ్డారు

చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే..రాష్ట్రంలో తిరగనివ్వం

 

అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓ గూండా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ విమర్శించారు. టీడీపీ నేతలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు కావాలనే నాపై రాళ్లు వేయించారని పేర్కొన్నారు. తన కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. దమ్ముంటే చంద్రబాబు బయటకు రావాలని సవాలు విసిరారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే..లేకుంటే రాష్ట్రంలో ఆయన్ను తిరగనివ్వమని హెచ్చరించారు.

కాగా, సీఎం వైయస్‌ జగన్‌పై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జోగి రమేష్‌ ఇవాళ చంద్రబాబు ఇంటి వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ గూండాలు ఎమ్మెల్యేపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

 

Back to Top