భూ సేకరణ నోటిఫికేషన్‌ ఎప్పుడు రద్దు చేస్తారు?

ఎమ్మెల్యే జోగి రమేష్‌
 

అమరావతి: బందర్‌ పోర్టు నిర్మాణానికి 33 ఎకరాలు కావాలని టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్‌ ఎప్పుడు రద్దు చేస్తారని ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రశ్నించారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. 
బందర్‌ పోర్టుకు దశాబ్దాల చరిత్ర ఉందని, ఈ పోర్టుపై టీడీపీ మాట నిలబెట్టుకోలేదన్నారు. మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి 33 వేల ఎకరాల కావాలని టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. 28 గ్రామాల్లో రైతులందరూ కూడా ఆందోళన చేపట్టారని తెలిపారు.

పేర్నినాని నాయకత్వంలో ఆ నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌ రైతుల పక్షాన నిలబడి ఉద్యమించారని తెలిపారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసుకుంటుందని చెప్పారు. బలవంతపు భూసేకరణ జీవోను రద్దు చేసిన దాఖలు చేయలేదు. ఈ నోటిఫికేషన్‌ను ఎప్పుడు విత్‌డ్రా చేసుకుంటారని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికలకు మూడు నెలల ముందు బందర్‌ పోర్టు నిర్మిస్తున్నామని చంద్రబాబు మచిలీపట్నంలో ప్రకటించారన్నారు. ఒక లారీలో ఓడను తెచ్చి మచిలీపట్నం ఊరేగించారని, ఇదే పోర్టు అంటూ చంద్రబాబు ప్రచారం చేశారన్నారు. ఐదేళ్ల కాలం చంద్రబాబు కళ్లు మూసుకొని ఎన్నికలకు ముందు లారీలో ఓడను తెచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూశారన్నారు. బలవంతపు భూసేకరణ చట్టాన్ని ఎప్పుడు వెనక్కి తీసుకుంటారని, పోర్టు నిర్మాణాన్ని అతిత్వరగా నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. 
 

తాజా ఫోటోలు

Back to Top