స‌మ‌స్య‌లు వింటూ..ప‌రిష్కారం చూపుతూ..

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు
 

పార్వ‌తీపురం: గపడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పార్వ‌తీపురంలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. ఇంటింటా ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే అల‌జంగి జోగారావు..ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా వింటూ..ఎక్క‌డిక్క‌డే ప‌రిష్కారం చూపుతూ  ముందుకు సాగుతున్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే  అలజంగి జోగారావు పురపాలక సంఘం ప‌రిధిలోని 21వ వార్డులో  ఎమ్మెల్యే ఇంటింటా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే  దృష్టికి బెహరా శంకర్ రావు సైకిల్ షాప్ నిర్వహణకు అవసరమైన రుణాన్ని మంజూరు చేయాలని కోర‌గా..వెంటనే ఎమ్మెల్యే  స్పందించారు. మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గంట వ్యవదిలోపలనే మెప్మా అధికారుల‌తో రూ. 20 వేల  రుణాన్ని మంజూరు చేసిన పత్రాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అంద‌జేశారు. అనంత‌రం అదే వార్డులోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించిన ఎమ్మెల్యే .. రోగులును కలుసుకుని మీకు అన్నీ వైద్య సేవలు సవ్యంగా అందుతున్నాయా అని ఆరాతీయగా బాగానే ఉన్నాయి అని వారు చెపారు. వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది ఈ కేంద్రానికి ఒక సీలింగ్ ఫ్యాన్ అవసరం ఉంది అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి కొత్త సీలింగ్ ఫ్యాన్ తెప్పించి ఆసుపత్రి సిబ్బందికి అందచేశారు. 

Back to Top