మాది మూడు తరాల మేనిఫెస్టో

గుడివాడ అమర్‌నాథ్‌
వైయస్‌ జగన్‌ పాలన మహానేత వైయస్‌ఆర్‌ను గుర్తు చేస్తోంది

40 ఏళ్లలో చేయని పనులు వైయస్‌ జగన్‌ 40 రోజుల్లో చేశారు

75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం గొప్ప విషయం

గ్రామాల నుంచి వలసలు ఉండవు

ఎల్లోమీడియా పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తోంది

అమరావతి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచనలతో రూపొందించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో మూడు తరాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్న తరుణంలో ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుతో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం పరిశ్రమల్లో 75 ఉద్యోగాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుపై  అమర్‌నాథ్‌ మాట్లాడారు. చారిత్రాత్మక బిల్లు ఆమోదంపై మాట్లాడేందుకు వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆలోచన రావడం గొప్ప విషయమన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారని చెప్పారు. ఆయనకు ఎదురైన అనేక అంశాలను, సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు వెళ్లారని, మేనిఫెస్టోలో పెట్టారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చట్టాలు చేయడం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానికంగా ఉన్న ప్రజలు భూములు ఇస్తుంటారని, వారికి ఉపాధి పోతుందని, పరిశ్రమల్లో ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తారన్నారు. పరిశ్రమల వల్ల అనేక సమస్యలు ఉంటాయని, అయితే స్థానికంగానే ఉపాధి దొరుకుతుందని ఆలోచన చేసి పేదవాళ్లు పరిశ్రమలకు భూములు ఇస్తుంటారు. పరిశ్రమలు వచ్చిన తరువాత స్థానికులను, భూములు ఇచ్చిన వారిని విస్మరిస్తుంటారని చెప్పారు. విశాఖలో పరిశ్రమలు వచ్చాయని, స్థానికులకు ఉద్యోగాలు రాలేదన్నారు. ఈ సభలో ఉన్నందుకు గర్వంగా ఉందని చెప్పారు. ఒక పక్క 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత, మరోపక్క 40 ఏళ్ల నవయువకుడు మరోపక్క ఉన్నారని తెలిపారు. ఎవరు చేయలేని కార్యక్రమాలు వైయస్‌ జగన్‌ 40 రోజుల్లో చేసి చూపించారన్నారు.

ఒక గొప్ప ముఖ్యమంత్రి వద్ద పని చేయడం ఈ రోజు అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. నిన్న కొన్ని ఆంగ్ల ఛానల్స్‌ మనం తీసుకుంటున్న ఈ నిర్ణయంపై దుష్ప్రచారం చేశారన్నారు. ఎల్లోమీడియా చానల్స్‌ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. కొత్తగా ఏమీ అడగటం లేదని, భూములు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని మాత్రమే చట్టం చేస్తున్నామని, ఇలాంటి సమయంలో ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీకి విభజన చట్టంలో ఎన్నో హామీలిచ్చారని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని కేంద్రంపై కథనాలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాన్ని యువతలో పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారన్నారు. గతంలో ఐదేళ్లు పని చేసిన ప్రభుత్వం ప్రజలకు ఏం చేశారో చూశామన్నారు. గతంలో చంద్రబాబు ఏ సమస్య అడిగినా రాజధాని, రాజధాని అన్నారని, వైయస్‌ జగన్‌కు గొప్ప మనసు ఉంది కాబట్టే ఇలాంటి చారిత్రాత్మక బిల్లును తీసుకువచ్చారన్నారు. లోకల్‌ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

అనకాపల్లి బెల్లానికి జీయోగ్రఫి గుర్తింపు కావాలని తపన పడుతున్నామని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో ఐదేళ్లకు సంబంధించినది కాదని, మూడు తరాలకు సంబంధించిన మేనిఫెస్టో అన్నారు. పుట్టిన బిడ్డ నుంచి మొదలై ఉద్యోగాలు కల్పించేలా ఆలోచన చేసిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. గతంలో టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఎప్పుడైనా చూపించిందా అని ప్రశ్నించారు. ఈ రోజు అనేక సందర్భాల్లో లక్షలాది మంది యువకులు వలసలు వెళ్తున్నారు. స్థానికులకు 75 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు. నాడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్రలో బాండ్రీక్స్‌ పరిశ్రమను ఏర్పాటు చేసి దాదాపు 24 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. అందులో 98 శాతం స్థానికులే ఉన్నారని, అది మహానేత వైయస్‌ఆర్‌ చేసిన ఆలోచనకు ఇవాళ ప్రతిఫలం చూస్తున్నామని చెప్పారు. 
 

Back to Top