నిజమైన సైకో చంద్రబాబే.. 

రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి 

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది చంద్రబాబే‌‌... 

 పోలీసులను కించపరిచేలా బాబు మాట్లాడడం సిగ్గుచేటు... 

 పోలీసులకు చంద్రబాబు భేషరతుగా క్షమాపణ చెప్పాలి... 

 కార్యకర్తల పరామర్శ పేరుతో బాబు అసభ్య పదజాలం ... 

అన్న‌మ‌య్య జిల్లా:  రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, అతని అనుచరులేనని అన్నమయ్య జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షులు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిప‌డ్డారు.  చంద్ర‌బాబు నిజ‌మైన సైకో అని విమ‌ర్శించారు.  సోమవారం పీలేరు పర్యటనలో కార్యకర్తల పరామర్శ పేరుతో చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలో తీవ్రవాదం ,ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజాలను అణచివేసింది తానేనని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నక్సలిజం, ఫ్యాక్షనిజం, తీవ్రవాదం రౌడీయిజం రాజ్యమేలిన విషయం ప్రజలు మర్చిపోలేదు అన్నారు. నక్సలిజం కారణంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు హత్యకు గురైన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. మీ పాలనలో నక్సలిజం, రౌడియిజం కారణంగా ఎంతోమంది ప్రజా ప్రతినిధులు, అధికారులను పొట్టన పెట్టుకోగా, మరి ఎందరో ఊర్లు వదిలి బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తల దాచుకున్న విషయం మరిచారా అంటూ నిలదీశారు. అంతకంటే దారుణంగా మీకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుటిల రాజకీయ పన్నాగంతో వంగవీటి రంగాను హత్య చేయించినది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్న పింగళి దశరథ రామయ్యను ఆటోలో వెళుతుండగా నడిరోడ్డుపై హత్య చేయించిన సంఘటనలను కూడా రాష్ట్ర ప్రజలు నేటికీ మర్చిపోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రతలు అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాటిని కూకటివేళ్లతో పెకిలించి ప్రజా పాలన అంటే ఏంటో చూపించారన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏమి చేసినా చూసి చూడనట్లు వెళ్లాలంటూ జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశించిన విషయం మరిచావా బాబు అంటూ ఆయన నిలదీశారు. నేడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు... రాష్ట్రంలో రౌడీముకలు, గుండాలపై కఠిన చర్యలు చేపడితే మీ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం బాబు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. నాడు గుంటూరు పట్టణంలోని మైనార్టీల పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయించి వారిని చిత్రహింసలకు గురి చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. రాయచోటి పట్టణంలో కూడా అమాయకులైన మైనార్టీలపై కేసులు నమోదు చేయించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయచోటి మైనార్టీలపై నమోదైన తప్పుడు కేసులను చట్ట ప్రకారం తొలగించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి వాటిపై స్టే తెచ్చినది మీరు కాదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 
వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాలనతో తనకు రాజకీయ భవిష్యత్తు లేదన్న అక్కసుతోనే తనకున్న కొన్ని వ్యవస్థల బలంతో శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న పల్లెలలో ప్రజలను రెచ్చగొట్టి ప్రశాంతతకు భంగం కలిగించే కుట్రకు తెర తీస్తున్నారన్నారు. డబ్బులు పోసి, భయపెట్టి, మభ్యపెట్టి కొంతమందిని పోగుచేసుకుని రోడ్లపైకి వచ్చి ప్రశాంతంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి, పెద్దయనగా పేరున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు సైకోలు అంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు. మరో మారు సీఎం మంత్రులపై కారుకూతల కూస్తే చంద్రబాబు నాయుడు అసలు బండారం బయటపెడతామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగలకు ఊర్లకు వెళ్లాలని చెప్పింది నేనే, భోగిమంటలు వేసుకోవాలని నేర్పించింది నేనే, అసలు పండుగలు ఎలా చేసుకోవాలో చూపించింది నేనే అంటూ మాట్లాడుతున్న చంద్రబాబునాయుడు నిజమైన సైకో అని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. తాను తలుచుకుంటే ఏమైనా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ఏంటో అసెంబ్లీలోనూ మీడియా ఎదుట బోరున ఏడ్చి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసిన పరిస్థితులు ఆయన అసహనాన్ని తెలియజేస్తున్నాయన్నారు.   తనకున్న పబ్లిసిటీ పిచ్చితో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలలో పర్యటిస్తూ అమాయకమైన ప్రజలను రెచ్చగొడుతూ వారి మధ్య విద్వేషాలను, వర్గాలను,, కులమతాలను రెచ్చగొట్టి   చంద్రబాబు నాయుడు చలికాంచుకుంటున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ, ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తున్న పోలీసుల మనో స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నరంటూ ఆయన మండిపడ్డారు. రోజుకు రూ 5 కోట్ల రూపాయల ఖర్చుతో జడ్ ప్లస్ కేటగిరి పోలీసులతో రక్షణ పొందుతున్న మీరు పోలీసుల సాయం లేకుండా ఒక్క అడుగు బయటకు వేయగలిగే ధైర్యం ఉందా అంటూ ఎమ్మెల్యే నిలదీశారు. పోలీసులు ఉన్నది 60 వేల మందేనని తాము తలుచుకుంటే ఏమైనా చేస్తామంటూ పోలీసులకు పై తీవ్ర పదజాలంతో దూషించడం చంద్రబాబు అహంకారానికి పరాకాష్ట అన్నారు. శాంతి భద్రతలే పరిరక్షణగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తాను మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి, దేశంలోనే సీనియర్ రాజకీయ నేతను అని చెప్పుకునే చంద్రబాబు పోలీసుల పైన, ముఖ్యమంత్రి,, మంత్రులపైన బాబు వాడుతున్న పదజాలం కామెడీ షోలను తలపిస్తోందన్నారు. ఈ కోవలోనే పండుగ రోజున కూడా పీలేరు పర్యటన ఎందుకు చేపట్టారో ఏమి మాట్లాడదలచుకున్నారో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థంకాని పరిస్థితి నెలకొంది అన్నారు. చంద్రబాబు పిలుపు, పార్టీ ఆదేశాల మేరకు వచ్చిన జనం కూడా బాబు మాటలు విని బాబుకు ఏమైందంటూ జుట్టు పీక్కుంటూ తిరుగు ప్రయాణం చేయడం కనిపించింది అని అన్నారు.

తాజా వీడియోలు

Back to Top