చంద్రబాబువి కుట్ర రాజకీయాలు

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి

చిత్తూరు:  ప్రతిపక్ష నేత చంద్రబాబువి కుట్ర రాజకీయాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మంత్రి పెద్దిరెడ్డితో కలిసి ఎమ్మెల్యేలు ద్వారకనాథ్‌రెడ్డి, బియ్యపు మధుసుదన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుప్పంలో వైయస్‌ఆర్‌సీపీ నేతల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడుతూ..40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు  ఇంకా సినిమా డ్రామాలు చూపిస్తున్నారు. కుప్పంలో ఇన్నాళ్లు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఓట్లు వేయలేదని, ఇప్పుడిప్పుడే వారికి ప్రజాస్వామ్యం వస్తోందన్నారు. స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉంటామని కుప్పం ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని తెలిపారు. 24 వార్డులు గెలిచిన మాకు ఒక్క వార్డును ఏకగ్రీవం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఆ వార్డులో నామినేషన్‌ వేసేందుకు టీడీపీ తరఫున ఎవరూ ముందుకు రాలేదన్నారు. బలవంతంగా చంద్రబాబు నామినేషన్‌ వేయించుకున్నారని చెప్పారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top