వైయస్ఆర్ జిల్లా: బద్వేల్ మున్సిపల్ సమావేశం అజెండాలో ప్రోటోకాల్‌ను విస్మరించడం పట్ల వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్లు అజెండాలో ఎందుకు పెట్టలేదని మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమాన పరచడం అధికారులకు సరికాదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నాయని, తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఎమ్మెల్యే సుధా మండిపడ్డారు.