వికేంద్రీకరణ జరగాల్సిందే

బాబూ..ఇంకెంతకాలం ప్రజలను మోసం చేస్తారు?

స్వార్థ ప్రయోజనాల కోసమే రాజధాని పోరాటం అంటున్నారు

అమరావతిలో చంద్రబాబు ఆస్తుల విలువ పెంచుకోవడానికే రాజధాని డ్రామా

ప్రజలెవరూ సహకరించకపోయినా ఏదో జరిగినట్టు నటిస్తున్నారు

మీ స్వార్థాన్ని సమర్థించమని జిల్లాల్లో తిరుగుతారా? 

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మీరు ఆలోచించరా బాబూ?

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పని చేస్తుంది

హైదరాబాద్‌ నుంచి విడిపోయినప్పుడు ఎలా నష్టపోయామో అమరావతి పేరుతో బాబు అదే చేయాలనుకున్నారు 

విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా కావాల్సిందే

కేంద్రీకృత పాలన అయితే మేం ఊరుకునే ప్రశ్నే లేదు. 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరగాల్సిందేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయాల్సిందే అని ఆయన కోరారు. చంద్రబాబు ఇంకా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు గత ఐదేళ్లు స్వార్థపూరిత పాలన చేశారు కాబట్టే ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మాన మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. సీఎం ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేస్తున్నాను. కొన్ని స్వార్థ పూరితమైన ప్రయోజనాల కోసం పని చేసిన శక్తులు ఎప్పుడైనా కడవరకు కూడా పోరాడుతూనే ఉంటాయి. అందులో సంపదను పెంచుకోవాలని, తనకు తన చుట్టూ ఉన్న వారికి మేలు జరుగాలని, ఆస్తుల విలువ పెరగాలని, సంపద పెరగాలని కుత్సిత బుద్ధితో చేసిన అమరావతి రాజధాని అనే బిజినెస్‌ మోడల్‌ సాధించుకోవాల్సిన ప్రయత్నాలను మనం గమనించినప్పుడు తప్పనిసరిగా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అది కొద్ది మంది ప్రయోజనమే తప్ప..విశాలమైన ప్రజల ప్రయోజనాలకు సంబంధించినది కాదని అందరికీ అర్థమైంది.  ఇన్నాళ్లుగా పోరాటం జరుగుతున్నట్లు ప్రతిపక్షం చిత్రీకరించే వ్యక్తుల్లో ఒక్కరైనా నీతిమంతులు ఉన్నారా? అంతా కూడా అయోమయానికి గురి చేస్తున్నారు. విశాల ప్రయోజనాలు ఉన్నాయని ఎవరూ చెప్పలేకపోతున్నారు. గడిచిన కాలంలో ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి అవతవకలకు పాల్పడి, తన సంపాదనను పెంచుకోవాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు, రాష్ట్రమంతా పర్యటిస్తాం..ప్రజలను ఒప్పిస్తామనడం హాస్యాస్పదం.

చంద్రబాబు అమరావతి కోసమే పర్యటన చేస్తున్నానని చెబితే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఇంకా మిమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారని అనుకుంటున్నారా? రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ప్రజలు నమ్ముతున్నారు. అమరావతి బార్డర్స్‌ చుట్టూ ఉన్న భూముల విలువ పెంచడానికి, చంద్రబాబు సృష్టించిన 8 నగరాల విలువ పెంచడానికే. హైదరాబాద్‌ను 70 ఏళ్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసినట్లుగానే అమరావతిలో కూడా పెట్టుబడులు పెట్టి అక్కడి భూముల విలువ పెంచడమే. ఇదే కదా మనం మోసపోయామని రాష్ట్ర విభజన సమయంలో సాధారణ పౌరుడు ఆందోళన చెందింది. కేంద్రం ఇచ్చిన నిధులు, సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు హైదరాబాద్‌లో పెట్టి గొప్పగా నిర్మాణం చేశాం. ఆ ప్రాంత వాసులకే చెందాలని వారు ఒకరకమైన భావన చెలరేగడమే 2014లో వచ్చిన ఉద్యమం. ఆ ఫలితమే రాష్ట్ర విభజన జరిగింది. ఇంత అనుభవం ఉన్నా తరువాత కూడా మళ్లీ ఇలాంటి మోసం ద్వారా ఆస్తులు పెంచుకోవాలని చంద్రబాబు దుర్మార్గంగా  ఆలోచన చేస్తున్నారు. దీని కోసం చంద్రబాబు ఊరువాడా తిరుగుతానంటే ఇంతకంటే అన్యాయం మరెక్కడ ఉంటుంది?. మా అందరి ఆవేదన ఏంటి? 80 ఏళ్ల కాలంలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయినా పూర్తి కాలేదే?. ఈ ఆవేదన, కన్నీరు ఎవరు తుడుస్తారు. ఎన్నిసార్లు చట్టసభల్లో మాట్లాడాలి. వంశధార ప్రాజెక్టు అంటే ఇప్పుడు చెబుతున్నది కాదు. నేరెడు వద్ద బ్యారేజ్‌ పూర్తి అయి, రిజర్వాయర్‌ కంప్లైట్‌ అయి, లెప్ట్‌, రైట్‌ కెనాల్స్‌ కాంక్రీట్‌ పూర్తి అయితే  వంశధార ప్రాజెక్టు పూర్తి స్వరూపం అయినట్లు. ఈ ప్రాజెక్టు రూ.2 వేల కోట్ల విలువ చేస్తుంది. ఇది ప్రభుత్వాలకు కష్టమైతే ..లక్షల కోట్లు తీసుకెళ్లే మీ ఆస్తుల విలువ పెంచుకుంటారా?.

మీరు చేసే పనులకు మేం చప్పట్లు కొట్టాలా?. ఇలాంటి అడ్డగోలు పనులు చేస్తే ప్రజాప్రతినిధులుగా మేం చట్టసభల్లో సమర్ధించాలా?. ఇలాంటి ప్రయత్నాలను చేతనైనంత స్థాయిలో వ్యతిరేకిస్తాం. మేం సామాజికంగా బలహీనులం కావచ్చు. కానీ మాకున్న స్థాయిలో గట్టిగానే వ్యతిరేకించగలం. స్వార్థపూరితమైన ఆలోచనతో వెంపర్లాడుతున్నారు. ఎక్కడ ఎవరు చనిపోయినా అమరావతి రైతులు చనిపోయారని చెబుతున్నారు. అమరావతిలో రైతులు ఎక్కడ ఉన్నారు. భూములన్నీ స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి మాటలు చెప్పి మిగతా వారిని మోసం చేయడం సరికాదు. మాకు కూడా సోషల్‌ మీడియా ఉంది. మా ఆవేదన కూడా వివరించగలం. ఇలాంటి స్వార్థ పూరితమైన ఆలోచన చేయడంతోనే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు. మీరు చేసిన స్వార్థపూరితమైన ప్రతిపాదనను తిరస్కరించాలని పిలుపునిస్తే దాన్ని నేడు అధికారంలో ఉన్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు ఎలా తీసుకెళ్తుంది?. అలా చేస్తే మేమందరం ఆ ప్రభుత్వానికి ఎందుకు సమర్ధిస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో జరిగే పని కాదు. తిరస్కరించబడిన మీ పాలన, స్వార్థపూరితమైన మీ ప్రతిపాదనలు, వాటి వెనుక ఉన్న మీ కుట్రలు తెలిసిన తరువాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కొత్త బాధ్యత ఉంది. పాలన వికేంద్రీకరణ జరగాలని మేం కోరుకుంటున్నాం.

ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతిపాదనలు ఏమున్నా కూడా మీరు దయచేసి వాయిదాలు వేయవద్దు. వంశధారా, నాగావళి రెండూ ఒడిస్సాలో ఈ నదులు ప్రవహించే క్యాచ్‌మెంట్‌ ఉంటుంది. రెండు నదులు సమాంతరంగా వెళ్తాయి. వరదల రూపంలో విరుచుకుపడుతాయి. ఆ వరదల నుంచి కాపాడేందుకు 2007లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతంలో ఏరియల్‌ వ్యూ చేసి  ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం చేసి భూములకు నీరివ్వడం ద్వారా రైతులకు సాయం చేయడం ఎంత అవసరమో?. పండిన పంటలు చెడిపోకుండా నిలబెట్టడం కోసం ఈ రెండు నదులకు కరకట్టలు నిర్మించడం కూడా అంతే అవసరమని గుర్తించారు. కృష్ణా, గోదావరి నదులకు కరకట్టలు ఉన్నట్లుగా మా నదులకు ఎందుకు నిర్మించరు. చంద్రబాబు లాంటి స్వార్థపరులైన నాయకులు ఇలాంటివి మరిచి, వ్యక్తిగతమైన సందప పట్ల ప్రేమ పెంచుకోవడమే.అందుకే చంద్రబాబు ఎక్కడా తట్టెడు మన్ను వేయలేదు. ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దుబారా ఖర్చులు ఆపి, మావైపు చూడండి. మా అవసరాలు తీర్చండి. స్వాతంత్ర్యం వచ్చిందన్న సంతోషాన్ని మాలాంటి ప్రాంతాలకు కూడా కలిగించండి.

ఇప్పుడు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తున్న వికేంద్రీకరణ ప్రయత్నం మాకు ఊపిరి పోసింది. లక్ష కోట్లు దుర్వినియోగం చేసి ఇతరులకు అభివృద్ధి చేరనివ్వకుండా చేసే ప్రయత్నాలను నేను అంగీకరించనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పిన మాట మాకు నచ్చింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు నిధులు కేటాయిస్తామన్న పెద్ద మాట  ఒక విశాలమైన ఆలోచనతో చేసిందని మేం భావిస్తున్నాం. అందుకోసమే ఈ విషయాన్ని మేం గట్టిగా సమర్ధిస్తున్నాం. చంద్రబాబు ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని అడుగుతున్నాను. మళ్లి తయారవుతున్నారు. మీ మాడల్‌లో మాకు ఏముంటుంది?. అందులో మాకు ఏమీ ఉండదు. సింగపూర్‌ కంపెనీలకు, మీకు, మీ చుట్టు ఉన్న మీ శ్రేయోభిలాషుల ప్రయోజనం కోసం మేమంతా మీ పాలన కింద మగ్గిపోవాలా?. ఇది జరిగే పని కాదు. విశాఖ పట్నం రాజధాని కావాల్సిందే. క్యాపిటల్‌ కోసం పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి వెనుకబడిన ప్రాంతాలను వదిలివేయడం కంటే..ఆ పెట్టుబడి అంతా ఈ ఐదేళ్లలో ఇతర ప్రాంతాల ప్రజల కన్నీరు తుడవడానికి పాలన సాగాల్సిందే. దానికి ప్రజలంతా మద్దతిస్తారని ఆశిస్తున్నాను.

మా తాత, తండ్రి, నేను, నా కుమారుడు ఇలా నాలుగు తరాలు చూసినా కూడా స్వాతంత్ర్య ఫలాలు అందవద్దా?. పరిస్థితులు మెరుగు కావద్ద్దా?. కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారు కానీ, 80 ఏళ్లు అయినా కూడా ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు. ఇది ప్రశ్నిస్తే మేమంతా శత్రువులమా? అనేక మార్లు మీరు కుర్చీల్లో కూర్చోవడానికి, ఊరేగడానికి, మీ పల్లకీలు మోయడానికి ఈ ప్రాంత ప్రజలు ఓట్లు వేయాలి..వీళ్ల క్షేమం కోసం మీరు ఆలోచించరా? వీళ్ల కన్నీరు తుడవడానికి మీరు ప్రయత్నం చేయరా?. వీళ్ల కడుపు నింపడానికి అవసరమైన వ్యవసాయానికి మీరు నీరు ఇవ్వరా?. ఇదే అడుగుతున్నాం. ఇన్నాళ్లు ఎందుకు మీరు చేయలేకపోయారు? ఐదేళ్లలో ఈ జిల్లాలో ఒక కలెక్టరేట్‌ కడుదామంటే అమలుకు నోచుకోవడం లేదు. మీరేమో  ఒక బిల్డింగ్‌కు 33 అడుగుల పునాది వేస్తారు. దాన్ని చూపించి సంతోషించమని చెబుతారు. జిల్లాలో 25 లక్షల మందికి అవసరమైన కలెక్టరేట్‌ భవనం కడుదామంటే రూ.40 కోట్లకు దిక్కు లేదే? ఎన్నాళ్లు నోరు మూసుకొని ఊరుకోవాలి. ఎప్పుడో ఏర్పడి విశాఖ నుంచి విడిపోయిన శ్రీకాకుళం జిల్లాకు పది మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం  లేదే? ఎవరికి చెప్పుకోవాలి. రాష్ట్రంలో జరిగే సెర్మోనియం ఫంక్షన్లు ఆగస్టు 15, జనవరి 26 వేడుకలు జరుపుకునేందుకు ఒక స్టేడియం లేదే?. రాష్ట్ర ప్రజలకు ఈ విషయాలన్నీ తెలియవు. మీరేమో కిలోమీటర్‌కు రూ.8 కోట్లు ఖర్చు పెడితే మేం సంతోషించాలా?. ఇలాంటి కేంద్రీకృత పాలన అయితే మేం ఊరుకునే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని రకాల తెగింపులు చేస్తాం. వికేంద్రీకరణ జరగాల్సిందే..పెట్టుబడులు మారుమూల ప్రాంతాలకు రావాల్సిందే..ఇంకా ఎన్నాళ్లు మా నోర్లు కట్టుకుని ఉండగలం. ఎక్కడో సంపదలు పెరిగిపోతుంటే వాటిని చూసి మేం ఆనందించాలా?. ఆ ఓపికలు పోయాయని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

ఇవాళ విశాఖపట్టణానికి కేపిటల్‌ తీసుకుచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం.. అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. విశాఖ కంటే అనువైన రాజధాని ఎక్కడ ఉందో చెప్పండి. దూరం కావచ్చు కానీ, చంద్రబాబు సంపద పెంచుకునేందుకు చేస్తున్న కుట్రలు ఎవరు సమర్ధించరు. ఈ-గవర్నెన్స్‌ వచ్చింది. రవాణా సౌకర్యాలు పెరిగాయి. ఈ రాష్ట్రంలోనే విశాఖ ఒక్కటే పెద్ద నగరం. 2014లోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. ఆ రోజు చంద్రబాబు స్వార్థపూరితంగా ఆలోచించడం వల్లే అప్పట్లో సాధ్యం కాలేదు. ఆ ఆలోచన కప్పి పుచ్చుకునేందుకు ప్రపంచంలోనే అమరావతి గొప్ప రాజధాని అని చెప్పారు. గొప్ప రాజధాని నిర్మించిన రాష్ట్రం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?. ఇది కేవలం స్వార్థపూరితమైంది. బలమైన అసత్యాలు చెప్పడానికి, ఎవరినైనా నమ్మించే వ్యక్తి చంద్రబాబు తన అక్రమ సంపాదనను వెచ్చిస్తున్నారు. మాకు పత్రికలు లేకపోవచ్చు. కానీ మేం నోరు విప్పుతాం..ఈ లోకానికి మీ అవినీతిని చాటిచెబుతాం. మీ కుట్రలకు బలి అయ్యే పరిస్థితి ఇక రాదు. 8 దశాబ్ధాలు చూశాం.. ఇక మా ఓపికలన్నీ నశించిపోయాయి. ఇక మోయలేం..అసెంబ్లీ అయిపోయిన తరువాత రోజుకో డ్రామాను చంద్రబాబు రక్తికటిస్తున్నాడు. అందుకే మరోసారి గొంతు ఎత్తాలని ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశాను.

 
 

Back to Top