అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చూసిన కన్నీటి గాధల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరును ప్రజలకు వివరించేందుకు చేపట్టిన స్వల్పకాల చర్చలో మాట్లాడారు. ప్రజలిచ్చిన అధికారం ఏ దిశ వైపు వెళ్తుంది.. ఏ లక్ష్యాలను చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అది రాజ్యాంగ బద్ధమా? మన స్థితిగతులు మారబోతున్నాయా అన్నది ఆలోచన చేయాలి. మన ప్రభుత్వాలు ఎవరు పనిచేసినా రాజ్యాంగ పరిధిలోనే పని చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న రెండు ప్రధానమైన విషయాల గురించి మాట్లాడినప్పుడు..పౌరులు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టుకు వెళ్తారు. రెండోది ఆదేశ సూత్రాలు పాటించని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పౌరులు కోర్టుకు వెళ్లే పరిస్థితి పెద్దగా లేదు. ప్రభుత్వాలు రాజ్యాంగ సూత్రాలు పాటించాల్సిందే తప్ప..ప్రశ్నించేవి తక్కువే. ఫైనల్‌గా ఎన్నికలు తీర్పుఇస్తాయి. మన సమాజం ప్రపంచంలోనే భిన్నంగా ఉంది. ఇక్కడ అనేక కులాలు, మతాలు, వర్గాలు, వ్యత్యాసాలు కలిగిన ప్రజలు ఉన్నారు. ఇలాంటి వి రాష్ట్రంలోనూ ఉన్నాయి. దీన్ని గుర్తు పెట్టుకొని పాలన చేయాల్సి ఉంటుంది.దీన్ని గుర్తు చేస్తూ ఆదేశ సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాలు పాటిస్తే..వందకు వంద శాతం రాజ్యాంగాన్ని పాటించినట్లే. సమాజంలో ఉన్న వ్యత్యాలు తగ్గించకపోతే అడవిలో ఉన్న వ్యక్తి ఎలా బయటకు వస్తాడు. సమసమాజ స్థాపన ఎలా జరుగుతుంది. ఇలాంటి వర్గాలను గుర్తించడం ఒక విషయం అయితే..వారికి ప్రభుత్వం అందించాల్సిన సాయాన్ని సక్రమంగా అందించాలి. ఇది ఒక పెద్ద సవాలు. అందించాల్సిన పథకాలు సక్రమంగా అందించని పరిస్థితి గతంలో చూశాం. చట్ట సభలో కేటాయించిన నిధులు 50 శాతం కూడా అందించలేకపోయారు. ఇలాంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఏర్పడిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ప్రశంసించాల్సిన అవసరం ఉంది. చాలా మంది తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. రాష్ట్రం దివాళ తీస్తుందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. పేదల ఆకలి, కన్నీరుపై వారికి సృహ ఉండదు. ఎవరు రక్తాన్ని చిందిస్తే పైకి వచ్చామోమరిచి ఆరోపణలు చేస్తున్నారు. ఒక నాయకుడు దీనికి భయపడకూడదు. నాయకుడికి ఏ వర్గాలు ఉన్నాయి. ఏం కోరుకుంటున్నారన్నది తెలియాలి. అందుకే వైయస్ జగన్ తాను చేసిన పాదయాత్ర, తాను చూసిన కన్నీటి గాధలు, హెచ్చుతగ్గులు కలిగిన ప్రమాణాలు అన్ని కూడా ఈ పరిపాలన వెనుక ఉన్నాయని సందేహం లేకుండా చెప్పగలను. కొంత మంది నాయకులు పత్రికలతో, మీడియాతో ఎదిగిన వారు ఉంటారు. వారికి ప్రజల కష్టాలు అర్థం కావు. ఎండా వానా, గాలి, వానా, అంటురోగాలు ఇలాంటి పరిస్థితుల మధ్య వైయస్ .జగన్ పాదయాత్ర కొనసాగించారు. తనకు అధికారం వచ్చినప్పుడు ఇలాంటి కష్టాలు తీర్చగలరు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటికీ కొన్ని వర్గాల గురించి, వృత్తుల గురించి తెలియదు. ఆ సృహ కలిగిన వాడిని తాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు చేసిన నాయకుడు సక్సెస్ అవుతాడు. వైయస్ జగన్ తన తండ్రి నుంచి సంక్రమించిన వారసత్వమైన ప్రజా నాయకత్వమని నా విశ్వాసం. వైయస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. కొంత మంది జీవనప్రమాణాలు మార్చారు. కొంత మందిలో గొప్ప మార్పులు తెచ్చారు. అదే ఒరవడిలో ఈనాటి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. అందులో నుంచి వచ్చిందే నగదు బదిలీ పథకం. అంబేద్కర్ మన రాజ్యాంగం గురించి చెబుతూ..ఒక మంచి రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు..కానీ వాటిని అమలు చేయని వ్యక్తులు లేకపోతే చెడ్డ రాజ్యాంగంగా మారుతుంది. చెత్త రాజ్యాంగమైన సరే..విశాల ధ్రుక్ఫథం కలిగిన నాయకుడు వాటిని సక్రమంగా అమలు చేస్తే అది గొప్ప పరిపాలన కింద, గొప్ప రాజ్యాంగంగా చెప్పవచ్చు అని అంబేద్కర్ చెప్పినట్లు ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు వివరించారు.