యనమల వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే

ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
 

అసెంబ్లీ: టీడీపీ నేతల యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రజల సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది.  గోదావరి ప్రజలను అణచివేసి నియంతలా యనమల వ్యవహరించారు.సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలతో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సంబరాల్లో ఉన్నారు. మండలిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు తన బినామీలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన బినామీలతో భూములు కొనిపించి ప్రజా సంపదను దోచుకున్నారు. సైంధవుల్లా నారా లోకేష్‌, యనమల రామకృష్ణుడు కీలకమైన బిల్లును మండలిలో అడ్డుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మండలి రద్దుపై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. ఈ తీర్మానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నాను. 

Back to Top