ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపించిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా: ప్రజాతీర్పుని గౌరవించకుండా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు దుర్భాషలాడించారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించాలన్నారు. ప్రజల సంతకాలతో సేకరించిన లేఖను గవర్నర్‌కు పంపేందుకు జిల్లా కలెక్టర్‌ చక్రధర్ బాబుకు ఎమ్మెల్యే అందజేశారు. 

ఈ సంద‌ర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సభ్య సమాజం చంద్రబాబు వైఖరిని తప్పు పడుతోందన్నారు. రాజకీయ మనుగడ కోసం దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. జనాగ్రహ దీక్షలో టీడీపీకి తీరుకి నిరసనగా గవర్నర్‌ లేఖ కోసం సంతకాలు సేకరించామని ఆయన తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top