రాజధాని వద్దు..అభివృద్ధే ముఖ్యం

సీఎం వైయస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

తమ వినతులను సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన రాజధాని రైతులు

రైతు కూలీలకు రూ.2500 నుంచి రూ.5 వేలు పెంచినందుకు కృతజ్ఞతలు

చంద్రబాబు అన్యాయాలను సీఎంకు వివరించిన రైతులు

ల్యాండ్‌ అక్విడిటేషన్‌ నోటిఫికేషన్‌ విత్‌డ్రా చేయాలని సీఎం ఆదేశం

రిజర్వ్‌ జోన్లను కూడా ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారు

రైతులకు పంటలు పండించుకునే హక్కు ఉంటుందన్న సీఎం

రైతుల వినతులను తీర్చాలని అధికారులను ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌

వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని, అభివృద్ధి ముఖ్యమని రాజధాని ప్రాంత రైతులు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వివరించారు. పంటలు పండే భూముల్లో రాజధాని వద్దని చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదని  రైతులు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తూ..ఇటీవల సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన ప్రోత్సహకాలపై రైతులు ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో రాజధాని రైతులు మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎంకు వివరించారు. ఆ వివరాలను ఎమ్మెల్యే ఆర్కే మీడియాకు వివరించారు.
రాజధాని రైతులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాజధాని రైతులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వాగ్ధానాలు, ముఖ్యంగా రైతు కూలీలకు రూ.2500 నుంచి రూ.5 వేల వరకు పరిహారం పెంచినందుకు సీఎం వైయస్‌ జగన్‌కు కూలీలు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కౌలు పరిహారం పదేళ్ల నుంచి 15 సంవత్సరాలకు పెంచడంతో సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. గడిచిన ఐదేళ్లు చంద్రబాబు రాజధాని పేరుతో చేసిన భూ దోపిడీ, అన్యాయాలు, అక్రమాలను రాజధాని ప్రాంతవాసులు ఐదేళ్ల క్రితమే పసిగట్టి ఎదురించాం. ల్యాండ్‌ ఫూలింగ్‌ వాలంటరీ అని చెప్పిన చంద్రబాబు తన రూట్‌ మార్చారు. చంద్రబాబు చేస్తున్న రాజధాని కాదు..రాజధాని పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా భూములు తీసుకుంటామని చంద్రబాబు చెప్పి..ఆ తరువాత ల్యాండ్‌ ఎ‌క్విజేషన్‌ పేరుతో బలవంతంగా తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించాం. రైతులను చంద్రబాబు బెదిరించారు. అక్రమ కేసులు పెట్టారు. పంటలను తగులబెట్టారు. ఆ రోజుల్లోనే వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటాలు చేశాం. మేం కోరుకున్నట్లుగా రాజన్న రాజ్యం వచ్చింది. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యారు. మేం కోరుకున్నట్లుగా మా జీవితాలు బాగుపడేందుకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు బాగుంటున్నాయి. చంద్రబాబు చేసిన అక్రమాలు, అన్యాయాలను సీఎం ముందుంచాం. 
మూడు నుంచి ఐదు పంటలు పండే భూములను బలవంతంగా చంద్రబాబు లాక్కున్నారు. చట్టప్రకారం తీసుకోకూడదని నియమ నిబంధనలు ఉన్నా చంద్రబాబు భూములు తీసుకున్నారు. దీనికి వైయస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. ల్యాండ్‌ ఎక్విజేషన్‌ విత్‌డ్రా నోటిఫికేషన్‌ వారం రోజుల్లోనే ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు, జయభేరి లాంటి సంస్థల వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు తనకు అనుకూలంగా ఉన్న వారి భూములను రిజర్వ్‌ జోన్‌ కింద చేర్చారు. ఈ రిజర్వ్‌ జోన్‌ను ఎత్తివేయాలని రైతులు సీఎంను కోరారు. రైతులు పంట పండించుకోవచ్చు. ఆ భూమి మీది, దానిపై సర్వ హక్కులు రైతులకే ఉంటాయి. హాయిగా పంటలు పండించుకోమని సీఎం చెప్పారు. చంద్రబాబు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించకముందు మా భూములు చాలా రేట్ పలికేవి. రాజధాని ప్రకటించిన తరువాత భూముల రేట్లు పడిపోయాయి.ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంచకుండా చంద్రబాబు జోన్లుగా విభజించి రైతులను ఇబ్బందులకు గురి చేశారు. రాజధాని రైతుల కోరుకున్నట్లుగా వారికి అనుగుణంగా పని చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి ముఖ్యం, ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తాం. రాజధానిలో అందరూ సంతోషంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. రాజధాని ఎక్కడికి పోవడం లేదు..ఇక్కడే ఉందని సీఎం భరోసా కల్పించారు. ఒక తండ్రి తన కుటుంబంలో బిడ్డలందరికీ ఎలా సమన్యాయం చేస్తారో అదే విధంగా మిగతా ప్రాంతాలకు కూడా సమన్యాయం చేస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. కేవలం రూ.503 కోట్లు ఖర్చు చేసి ఏపీని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారు. రాజధాని నిర్మించాలంటే లక్ష పాతిక వేల కోట్లు అవసరం అవుతాయి. మేం మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో రాజధాని వద్దు..ప్రతి ఏటా మూడు నుంచి ఐదు పంటలు పండించుకుంటున్నామని చంద్రబాబుకు ఎంత చెప్పినా వినలేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మా జీవితాలు మేము బతకనివ్వండి అని చంద్రబాబును వేడుకున్నా కూడా వినలేదు. రాజధానితో మాకు సంబంధం లేదు. అభివృద్ధే ముఖ్యమని రాజధాని ప్రాంతవాసులు కోరుకోవడంతో సీఎం వైయస్‌ జగన్‌ సంపూర్ణంగా ఒప్పుకున్నారు.తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలకు మోడల్‌ మున్సిపాలిటీలుగా చేసేందుకు రూ.1200 కోట్లు కేటాయించారు. 2014లో ఎమ్మెల్యే ఆర్కే, వైయస్‌ జగన్‌కు అండగా ఉన్నామని చంద్రబాబు ఐదేళ్లలో మా గ్రామాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదు.  ఓటు అనే ఆయుధంతో చంద్రబాబు కొడుకు లోకేష్‌ను ఓడించామని రైతులు సీఎం వైయస్‌ జగన్‌కు వివరించారు.మంగళగిరిలో రోడ్లు ఏర్పాటు చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.మూడు నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని సీఎం మాటిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం వైయస్‌ జగన్‌కు రైతులు ధన్యవాదాలు చెప్పారు. మంగళగిరి ప్రాంతంలో ఉన్న ఆరు ఎత్తిపోతల పథకాలను, పైప్‌లైన్‌ పనులను కూడా సీఎం వైయస్‌ జగన్‌ నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయం చేసేందుకు సాగునీటిని ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. సుమారుగా రూ.8 కోట్లు విడుదల చేసేందుకు సీఎం సంతకాలు చేశారు. మనసున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు రైతులతో కలిసి వచ్చామని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top