విజయనగరం: రాష్ట్రంలో ప్రజా మద్దతుతో మళ్లీ గెలిచి నిలిచేది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అని పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్న ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్వతీపురం 11వ వార్డు ఎన్నికల ప్రచారంలో శాసనసభ్యులు అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చటమే కాకుండా హామీ ఇవ్వని అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసి రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను మెరుగు పరుస్తూ విద్య, వైద్య వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేశారన్నారు. నేడు దేశంలోనే గర్వించ తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, వైద్య వ్యవస్థలను మెరుగుపరచడం జరిగిందన్నారు. మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి పేరిట అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకులు మన సీఎం వైయస్ జగన్ అన్నారు. ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలే మళ్లీ ఆయన్ను 2024 ఎన్నికల్లో గెలిపించి తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన అందరి నాయకులు వైయస్ జగన్ గారిని గెలిపించి ముఖ్యమంత్రి చేసుకొని మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, పార్టీ ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, జెసిఎస్ కన్వీనర్ గొర్లి మాధవరావు, వైసీపీ సీనియర్ నాయకులు పోల సత్యనారాయణ, స్థానిక కౌన్సిలర్ సభ్యులు గెంబలి బాలమురళీకృష్ణ, తాడ్డి శంకర్రావు, జే దివ్య, అర్ చిన్నం నాయుడు, వి నేతాజీ, ఎస్ లావణ్య, కోరాడ శ్రీనివాసరావు (నాని), మజ్జి సేశికర్, ఎస్ లక్ష్మి పార్వతి, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, సచివాలయం కన్వీనర్లు చింతాడ శైలజ, ఆకుల శ్రీనివాసరావు, సామల లలితా కుమారి, గండి భాగ్యవతి, ఆల్తి విజయలక్ష్మి, చందాన ఆనంద్, బొంగు సురేష్, ఎస్ చంద్ర, పీరయ్య, సుధాకర్, గృహ సారథులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.