పార్వతీపురం: ప్రతీ ఇంటికీ కుళాయి ద్వారా తాగు నీరు అందించాలనే ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. చిలకలపల్లి గ్రామంలో 59 లక్షల రూపాయల నిధులతో ఇంటి ఇంటి కుళాయి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ప్రతీ గ్రామానికి జల జీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటి ఇంటికీ కుళాయి కనెక్షన్లు వేయించి ప్రతి ఇంటికీ సురక్షిత రక్షిత మంచినీరు అందించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ వహించారు. పైప్ లైన్ పనులను త్వరిత గతిని ప్రారంభం చేయించి ఇప్పటికే అనేక గ్రామాలలో పనులు పూర్తి చేయించి మంచి నీరు అందిస్తున్నారు. ఈ గ్రామంలో కూడా త్వరగా పనులు పూర్తి చేసి మంచినీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అలజంగి రవి కుమార్, ఎంపీపీ గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు వెలిది సాయిరాం, బెవర హేమలత, అర్డబ్యుఎస్ డిఈ హనుమంత్ రావు, సర్పంచ్ అలజంగి సుందరరావు, వైస్ సర్పంచ్ పి శేషగిరిరావు, స్టేట్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, వైయస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు తప్పిట ప్రసాద్, గుడివాడ జగన్, కురిటి వెంకటరమణ, జీ లక్ష్మణరావు, బి తమ్మీ నాయుడు, ఎస్ భాస్కరరావు, జీ శ్రీరాములు నాయుడు, అర్ రమణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.