ఇంగ్లిష్‌ మీడియం బోధన విద్యా విప్లవానికి నాంది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు
 

 

అసెంబ్లీ: ఇంగ్లిష్‌ మీడియం బోధన విద్యా విప్లవానికి నాంది అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో చదివించాలనే తపనతో ఎంతోమంది పేదలు అప్పులపాలు అవుతున్నారన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరికీ ఉచితంగా ఇంగ్లిష్‌ మీడియం బోధన చేయాలనే మంచి ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ బిల్లుకు తాను సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లుగా అదీప్‌రాజు చెప్పారు. తెలుగు మీడియంలో చదివి డిగ్రీ పాసై కూడా ఆటో డ్రైవర్లుగా, కూలీలుగా మారుతున్నారన్నారు. తాను ఇటీవల పెందుర్తి నియోజకవర్గంలోని ఆర్పీఅగ్రహారం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వెళ్లానని, అక్కడి ప్రభుత్వ స్కూల్‌ను సందర్శిస్తే.. అక్కడ నాల్గవ తరగతి విద్యార్థినీ నాడు – నేడు కార్యక్రమం, అమ్మ ఒడి పథకం తీసుకువచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు ఆ చిన్నారి థాంక్యూ సీఎం సార్‌ అని చెప్పిందని, ఆ వీడియోను అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. నాడు – నేడు ద్వారా పాఠశాల రూపురేఖలు మార్చాలని సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారని, అక్షరాస్యత పెరగాలని, అందని ద్రాక్షలా మారిన ఇంగ్లిష్‌ మీడియం బోధనను పేదల గుమ్మం ముందుకు తీసుకువచ్చారన్నారు.

Back to Top