పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప పాదయాత్ర పండుగలా సాగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలు తెలుసుకున్న వైయస్ జగన్... నేను విన్నాను.. నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల కష్టాలను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తున్నారన్నారు. దెందులూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ పాదయాత్ర నాలుగు రోజుల పాటు సాగిందన్నారు. నాలుగు రోజులు పండగ వాతావరణం నెలకొందన్నారు. దెందులూరులో వైయస్ జగన్ అడుగుపెట్టగానే ఆటో డ్రైవర్లు అంతా వచ్చి వారి కష్టాలను చెప్పుకున్నారన్నారు. ఆటో అన్నలను ఆదుకుంటానని ఏలూరు సభలో ప్రకటించారని ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైయస్ జగన్ ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారన్నారు. సీఎం వైయస్ జగన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారన్నారు. Read Also: ప్రజా సంకల్పానికి రెండేళ్లు