ప్రజా సంకల్పానికి రెండేళ్లు

నేను విన్నాను.. నేను ఉన్నానంటూ అచ్చం రాజన్నలా

తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా సాగిన వైయస్‌ జగన్‌ పాదయాత్ర

నాబిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ భావోద్వేగంతో అన్న మాటలు గుర్తుండే ఉంటాయి. జనానికి అప్పగించిన ఆ బిడ్డ చేతులు కోట్లాది మంది కన్నీరు తుడిచాయి. నేనున్నానంటూ భరోసానిచ్చాయి. బ్రతుకులు మార్చుతానంటూ పలికిన మాటలు బడుగుల జీవితాలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. ప్రజాకంటక పాలనపై సమరశంఖం పూర్తిస్తూ 2017 నవంబర్‌ 6వ తేదీన ప్రజా సంకల్పయాత్ర పేరిట వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. వందా.. ఐదు వందలు కాదు.. ఏకంగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి  జనం గుండెల్లో దాగి ఉన్న బాధను తెలుసుకున్నాడు. ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి రేపటికి రెండేళ్లు.

తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా, తల్లి ఆశీస్సులే అండగా, ప్రజలే దైవంగా భావించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఇడుపులపాయలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా ప్రారంభమైంది. ప్రజల కోసం వైయస్‌ కుటుంబం నుంచి మూడో పాదయాత్ర మొదలైంది. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్రంలో తల్లడిల్లుతున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులకు స్వాంతన చేకూర్చేందుకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

రాజన్న బిడ్డకు ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రగా వస్తున్న జననేతకు తమ సమస్యలు చెప్పుకుందామని దారిపొడవునా వినతులు పట్టుకొని, గుండె నిండా బాధ నింపుకొని వచ్చారు. వచ్చిన వారిని అంతే ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యను తెలుసుకుంటూ.. నేనున్నాను అవ్వా.. అమ్మా.. చెల్లి, అక్కా.. తాతా.. తమ్ముడు అంటూ అచ్చం రాజన్నను గుర్తుచేశాడు. వైయస్‌ జగన్‌ పాదయాత్రకు జిల్లా జిల్లాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. జగనన్న అడుగులో అడుగు వేయాలని, కలిసి నడవాలని పొరుగు రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. హేళనగా మాట్లాడినా అన్నింటినీ ఓర్చుకున్నాడు. ఎముకలు కొరికే చలిలో.. మండే అగ్నిగుండలా ఉండే ఎండలో.. వర్షపు చినుకుల్లో పాదయాత్ర సాగింది. ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. వారిలో ధైర్యాన్ని నింపాలి.. అనే ఆత్రుత, ప్రజలపై ఉన్న మమకారం గాయాలను సైతం లెక్కచేయలేదు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైయస్‌ జగన్‌ను అంతం చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయి. విశాఖ ఎయిర్‌పోర్టులో జననేతపై హత్యాయత్నం కూడా జరిగింది. భుజానికి కత్తిగాయమైనా.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం.. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు.

నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో సభలో మాట్లాడిన వైయస్‌ జగన్‌.. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలతో కేవలం రెండు పేజీలతో వైయస్‌ఆర్‌ సీసీ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి వెళ్లాడు. ఒక్క అవకాశం ఇవ్వండి.. ప్రజలు మెచ్చే పాలన అందిస్తానని చెప్పాడు. వైయస్‌ జగన్‌ పడిన కష్టానికి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అధికార పీఠం ఎక్కిన నాటి నుంచి ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ఐదు నెలల పాలనేలోనే పీపుల్స్‌ సీఎంగా పేరుతెచ్చుకున్నారు సీఎం వైయస్‌ జగన్‌.

Read Also: నడిచొచ్చిన నాయకుడు  

Back to Top