వరద బాధితులకు మంత్రుల భరోసా

 గుంటూరు: వరద కారణంగా ముంపునకు గురైన బాధిత కుటుంబాలు, రైతులకు మంత్రులు భరోసా కల్పిస్తున్నారు. బుధవారం పెనమలూరు, అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పంటనష్టం అంచనాపై అధికారులను ఆరా తీస్తున్నారు. రైతుల సమస్యలను మంత్రులు తెలుసుకుంటున్నారు. పెదపులిపాకలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, కన్నబాబు, ఎమ్మెల్యేలు పార్థసారధి, రక్షణ నిధి, కైలే అనిల్‌కుమార్‌ పర్యటించి వరద బాధితులు, రైతులకు భరోసా కల్పిస్తున్నారు. 

Back to Top