అంతర్వేదిని సంద‌ర్శించిన మంత్రులు

విజ‌య‌వాడ‌: అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం పూర్తిగా దగ్ధమైన ఘటన నేప‌థ్యంలో   ఏపీ మంత్రులు ప‌ర్య‌టించారు.  మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పినిపె విశ్వరూప్ తదితరులు ఆల‌యాన్ని సంద‌ర్శించి, ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌పై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాసరావు మాట్లాడుతూ..  అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని  అన్నారు.  రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 ల‌క్ష‌ల రూపాయ‌లతో అంతర్వేది రథం నిర్మాణం జ‌రిగే విధంగా చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు  మంత్రి విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top