సంక్షేమ, అభివృద్ధి పథకాలే వైయ‌స్ఆర్ సిపిని గెలిపిస్తాయి 

ప్రజలను ఓట్లు అడుగే హక్కు వైయ‌స్ఆర్ సిపి కే ఉంది...

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, అంజాద్ బాష

నెల్లూరు: ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలే వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డిని గెలిపిస్తాయ‌ని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,కాకాని గోవర్ధన్ రెడ్డి,  అంజాద్ బాష ధీమా వ్య‌క్తం చేశారు. శ‌నివారం ఆత్మకూరులో జరిగిన మీడియా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,కాకాని గోవర్ధన్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులు రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారక నాధ రెడ్డి, మాజీ ఎం ఎల్ సి మాదాసు గంగాధర్ మాట్లాడారు.
     సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ప్రజలునుఓట్లు అడిగే హక్కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, ప్రజలకు టి డి పి వాళ్ళు ఏంచేశారని బస్సు యాత్రలు  చేపట్టారని ప్రశ్నించారు. పోలవరం, స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా లు ఇచ్చి ఓట్లు అడిగితే బాగుండేదని, ఏమీ ఇవ్వకుండా ప్రజలను  మోసగించారన్నారు.ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని  వారు దుయ్య‌బ‌ట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top