సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయం అమలు

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీనే కారణం

మా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది

అధికారం కోసం చంద్రబాబు రోజుకో అబద్ధం ఆడుతున్నారు

ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభకు చంద్రబాబే కారణం

కోనసీమ అంబేద్కర్‌ జిల్లా: సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయం అమలవుతుందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీనే కారణమన్నారు.మంత్రి సోమవారం మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో 33.3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. 2014లో చంద్రబాబు సుప్రీం కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో రిజర్వేషన్లు కొనసాగించాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తాం. ఆ తరువాత సవరించవచ్చు అని చంద్రబాబు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ సమర్పించారు. వైయస్‌ జగన్‌ డిసెంబర్‌ 20, 2020లో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటే ప్రతాపరెడ్డి అనే టీడీపీ నాయకుడితో చంద్రబాబు పిల్‌ వేయించారు. లోకేష్‌ బాబు ఒకసారి చూడు. అచ్చెన్నాయుడు ఒకసారి విను..రిజర్వేషన్లు తగ్గడానికి టీడీపీనే కారణం. ఆ రోజు సకాలంలో టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించని కారణంగా ఆ రోజు న్యాయమూర్తి తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్లారని వక్రీకరిస్తున్నారు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 50 శాతం రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు..మార్కెటింగ్‌ కమిటీ నియామకాల్లో, అన్నింటిలో మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. దేశంలోనే అత్యున్నత పాలన ఏపీలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అందిస్తున్నారు. సామాజిక న్యాయం అన్న పదం వినాలంటే అది ఏపీలోనే అమలవుతుందన్న మాట మేధావులు, అనేక మంది పెద్దలు చెబుతున్నారు. 
బీసీలను రుణగ్రస్తులను చూడాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు చేయి చాపకుండా ప్రభుత్వమే సుమారు రూ.2.10 లక్షల కోట్లు డీబీటీ ద్వారా పొందారు. టీడీపీ పాలనలో నాయీ బ్రహ్మణులు, నేత కార్మికులు, మత్స్యకారులను విస్మరించారు. ఇవాళ మత్స్యకారభరోసా, నేతన్న నేస్తం, చేదోడు, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా నేరుగా డబ్బులు అందించిన ఘనత వైయస్‌ జగన్‌ ప్రభుత్వానిది. 
చంద్రబాబుది ఒక్కటే లక్ష్యం..అధికారం కోసం ప్రతి రోజు ఏదో ఒక వేషం వేసి అబద్ధాలు ఆడుతున్నాడు. ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. బీసీ సోదరులకు ఇవాళ ఒక్కటే మనవి చేస్తున్నాను. చంద్రబాబు టైమ్‌లో కార్పొరేషన్లు ఉన్నాయా? ఇవాళ 56 కార్పోరేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా రాజకీయ స్థితి, మా సామాజిక వర్గాల ఆత్మగౌరవం ఇవాళ పెరిగింది.
టీడీపీ పాలనలో ఐదేళ్లలో ఒక్క బీసీకైనా రాజ్యసభ సీటు ఇచ్చారా?. ఇవాళ నలుగురు బీసీలు రాజ్యసభలో మా వాణిని వినిపిస్తున్నారు. శాసన సభలో స్పీకర్‌ బీసీ, పది మంది మంత్రులు ఉన్నారు. చంద్రబాబులా భావజాలం లేని వ్యక్తి కాదు వైయస్‌ జగన్‌..నా వాళ్లు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నారు. ఎల్లోమీడియా  పదే పదే ఒకేరకమైన అబద్ధాలు చెబుతోంది. ఎవరి హయాంలో రిజర్వేషన్లు అమలు అయ్యాయన్నది ఈనాడుకు తెలియదా? రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి చంద్రబాబు కాదా? అభివృద్ధిని అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు కాదా?. అమరావతి ప్రాంతంలో 55 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వైయస్‌ జగన్‌ సిద్ధమవుతున్నారు..ఈనాడుకు కళ్లు కన బడటం లేదా?.
చంద్రబాబు పేదల ఇళ్లను సమాధులతో పోల్చుతారా? త్వరలోనే చంద్రబాబు రాజకీయ జీవితానికి ప్రజలు సమాధులు కడుతారు కబర్దార్‌..ఎస్సీ, ఎస్టీ, బీసీలను కించపరిచే స్వభావాన్ని చంద్రబాబు మార్చుకోవాలి. 
ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. ఆ వేదికపై ఉన్న పెద్దలు, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఎన్టీఆర్‌ క్షోభకు కారకుడు చంద్రబాబు కాదా? ఎన్టీఆర్‌ గొప్ప ఆశయంతో రూ.2 కిలోబియ్యం, మద్య నిషేదాన్ని తీసేసింది ఎవరు? యుగ పురుషుడిని కించపరిచింది ఎవరు? నీవు కాదా చంద్రబాబు? ఆ కుటుంబాన్ని ఏ రకంగా హింసించారో ఎన్టీఆర్‌ అభిమానులకు తెలుసు. చంద్రబాబు తన అధికారం కోసం కుటుంబ సభ్యులను వాడుకున్నారు. 
నాలుVó ళ్ల వైయస్‌ జగన్‌పాలనలో అవినీతికి తావు లేదు. చంద్రబాబు నిజస్వరూపాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఎస్సీలు రాజధాని ప్రాంతంలో ఉంటే సామాజిక సమతుల్యత వస్తుందని అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తికి గుణపాఠం చెప్పాలని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

 

Back to Top