చిరువ్యాపారులకు అండగా ‘జగనన్న తోడు’

అర్హులైన ప్రతిఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు, ఆ కుటుంబాల్లో సంతోషాలు నింపేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించి చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులకు అండగా నిలిచారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ పరిపాలన చేస్తున్నారన్నారు. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా చిరు వ్యాపారులకు మంచి అవకాశం కల్పించారన్నారు. దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు, చేతివృత్తి దారులకు రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణం అందిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి జీర్ణించుకోలేక టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top