దేవాదాయ భూములు కబ్జాచేస్తే కఠినచర్యలు

6సి దేవాలయాలఅర్చకులకు 25 శాతం జీతాలు పంపు

దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

అమరావతిః 6సి దేవాలయాల్లో అర్చకులకు 25 శాతం జీతాలు పెంచుతూ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తొలి సంతకం చేశారు. సచివాలయంలో దేవాదాయ మంత్రిగా  వెల్లంపల్లి శ్రీనివాస్‌ బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖలో ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం,బదిలీల మార్గదర్శకాలపై చర్యలు తీసుకోవాలని సంతకాలు చేశారు. గతంలో సదావర్తి భూములను కబ్జా చేయాలని టీడీపీ నేతలు చూశారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని దేవాలయాల భూములను పరిరక్షిస్తుందన్నారు.అన్ని ఆలయాల పాలకమండళ్లను రద్దు చేసి కొత్త కమిటీలు నియమిస్తామన్నారు.దేవాదాయ భూములు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top