విశాఖ: రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిధిలోని అమృతపురంలోని అంగన్ వాడీ కేంద్రాన్ని స్ధానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ తో కలిసి మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం అక్కడ జరుగుతున్న గర్భిణుల సామూహిక సీమంతాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మహిళలకు చీరె సారె అందించారు. స్వయంగా భోజనాలు వడ్డించారు.