రుణమాఫీ ఎగ్గొట్టిన బాబు మహిళోద్ధారకుడా..?

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అన్నది మా ప్రభుత్వ విధానం

డ్వాక్రా మహిళలతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ది ఆత్మీయసోదర బంధం

ఈనాడు అడ్డగోలు రాతల్ని డ్వాక్రా మహిళలు నమ్మరు..

మహిళా సాధికారతకు బాటలేసిన అభినవ అంబేద్కర్‌ జగనన్న

మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌

తాడేప‌ల్లి: చంద్రబాబు హయాంలో ఒక్క మంచి పథకమైన అమలు చేశారా..? రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు న్యాయం చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బాబు అమలు చేయలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ మండిపడ్డారు. మ‌హిళా సాధికార‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో సాధ్య‌మ‌వుతోంద‌ని, మ‌హిళ‌లు ఆకాశంలో స‌గం, అవ‌కాశాల్లో స‌గం అన్న‌ది మా నినాదం, మా ప్ర‌భుత్వ విధాన‌మ‌ని చెప్పారు. ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

మంత్రి శ్రీమతి ఉషాశ్రీచరణ్‌  ఇంకా ఏం మాట్లాడారంటే.. 

మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి రాష్ట్రంలో ఒక విజనరీ కలిగిన నాయకుడి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వానికి నడుమ ఒక ఆత్మీయ అనుబంధం నడుస్తోంది. అదే చంద్రబాబు హయాంలో మాత్రం రుణబంధం నడిచింది. కుటుంబంలో  అన్నగా, తమ్ముడిలా మహిళల సంక్షేమం, వారి అభివృద్ధి పట్ల బాధ్యతతో ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తమ కృతజ్ఞతల్ని చాటుకునేందుకు డ్వాక్రాసంఘాలు ఉత్సాహపడుతున్నాయి. అందుకే, రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాక్రమాలకు డ్వాక్రా అక్కచెల్లెమ్మలు వేలాదిగా తరలివస్తున్నారు. తోడబుట్టిన సోదరుడిగా జగనన్న దీవెనలందుకోవడానికి ఈరోజు ప్రతీ డ్వాక్రాసంఘంలోని అక్కచెల్లెమ్మలు ఉత్సాహం చూపుతున్నారు. 2024లో వైయ‌స్‌ జగన్‌కి మరోమారు అధికారం కట్టబెట్టేందుకు మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయనకు వత్తాసుపలికే ఈనాడు లాంటి పచ్చమీడియా నేడు కుళ్లికుళ్లి ఏడుస్తుంది. మేమేదో బెదిరించి బలవంతంగా మహిళల్ని మీటింగులకు తరలిస్తున్నామంటూ.. రోతపుట్టించే రాతలతో డ్వాక్రాసంఘాల మహిళల ఆత్మగౌరవాన్ని ఈనాడు పత్రిక దెబ్బతీస్తుంది. 

డ్వాక్రా సంఘాల్ని నిలువునా ముంచింది బాబే..
మహిళల్ని మాయమాటలతో భ్రమల్లో నింపి పబ్బంగడుపుకునే రోజులు మారాయి.. అని బాబు తెలుసుకోవాలి. 2014 ఎన్నికల మ్యానిఫెస్టో చంద్రబాబు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోయాడనేది డ్వాక్రా మహిళలందరికీ తెలుసుకదా.. 2014 నుంచి 2019 వరకు బాబు ఏం చెప్పాడో.. చెప్పిన మాటలు ఏ విధంగా తప్పాడో అందరూ చూశారుకదా.. డ్వాక్రాసంఘాల రుణమాఫీని బాబు చేశారా..? అక్షరాలా రూ. 14,205 కోట్ల రుణమొత్తాన్ని చెల్లించకుండా మోసం చేసిన సంగతి మహిళలు మరిచిపోలేరు. ‘బాబూ.. నీ హయాంలో ‘ఎ’, ‘బి’ గ్రేడ్‌ గా ఉన్న డ్వాక్రా సంఘాలన్నింటినీ నిర్వీర్యం చేసి ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయి కదా..నమ్మి ఓటేస్తే మోసం చేసిన నాయకుడివి నువ్వుకాదా.?’ బాబు హయాంలో చాలా సంఘాలు ఎన్‌పీఏలుగా అవుట్‌స్టాండింగ్‌ జాబితాల్లోకి చేరాయి. బాబు దిగిపోయేనాటికి డ్వాక్రా సంఘాల అప్పులు రూ.25,517 కోట్లకు చేరిపోయిన విషయం అందరికీ తెలిసిందే.. చేసిన అప్పులు, వాటిపై వడ్డీలు, వాటికి చక్రవడ్డీలు అన్నీ ఏకమై తడిసిమోపెడయ్యాయి. మరోవైపు సున్నావడ్డీ పథకానికి కూడా చంద్రబాబే పూర్తిగా ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. ఇవన్నీ గుర్తుంచుకున్న మహిళలు 2019లో మాదిరిగానే 2024లోనూ బాబును ఓడిస్తారు..  

అభినవ అంబేద్కర్‌ జగనన్న 
మా గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు డ్వాక్రా సంఘాలన్నీ ఆర్ధికంగా నిలదొక్కుకున్నాయి. గతంలో 18.36 శాతం ఎన్‌పీఎలుగా, అవుట్‌స్టాండింగ్‌లుగా ఉన్న సంఘాలన్నీ ఈరోజు 73శాతం ప్రగతిబాట పట్టాయి. మహిళల ఆర్థిక, సామాజిక, అభ్యున్నతికి నిరంతరం ఆలోచన చేస్తూ రాజకీయ, సామాజిక, సమన్యాయంతో మహిళాసాధికారతకు ముఖ్యమంత్రి జగనన్న అభినవ అంబేద్కర్‌గా సంకల్పించారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి 80 లక్షల సంఘాలు ఉంటే, అవి ఈరోజు 1.2 కోట్ల సంఘాలుగా పెరిగాయి. అంటే, దాదాపు మూడున్నరేళ్ల కాలంలో అదనంగా 20 లక్షల సంఘాలు పెరిగాయి. దీన్నిబట్టి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం ఏమేరకు ఉందో  చెప్పుకోవచ్చు. 

ఆడబిడ్డలకు అన్నగా అండనిస్తున్న జగనన్న 
రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం తీసుకున్నా మహిళలకే సింహభాగం వాటా అందిస్తూ ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం అనే నినాదాన్ని ప్రభుత్వ విధానంగా మర్చి  ముఖ్యమంత్రి జగనన్న పథకాలు అమలు చేస్తున్నారు. ‘మహిళల మనస్తత్వం చూస్తే.. పుట్టింటికి పిలిచి అన్నగా, తమ్ముడిగా అప్యాయతల్ని పంచితే జీవితాంతం మురిసిపోతాం..’ అలాంటిది, ఈరోజు మహిళామతల్లుల కోసం అహర్నిశలు కష్టించి వారిని ఆత్మగౌరవ శక్తులుగా తీర్చిదిద్దాలని తపించే జగనన్నను మహిళలు తమ గుండెల్లో పెట్టుకుని దైవంలా పూజిస్తున్నారనే విషయం పచ్చమీడియా గుర్తించాలి.

అమ్మ ఒడి, ఆసరా, చేయూత, చేదోడు.. ఇలా ఏ పథకం చూసినా మహిళలే మహారాణులంటూ జగనన్న మాకు ప్రయార్టీ కల్పించడం చరిత్రలో నిలిచిపోయే గొప్ప విజయం. జగనన్న ప్రభుత్వంలో 44.50 లక్షల మంది తల్లులు తమ పిల్లల్ని బడిబాట పట్టించేందుకు అమ్మఒడి కింద రూ.19,617 కోట్లు లబ్ధికలిగించిన గొప్ప సంస్కరణను దేశమే ఆదర్శంగా తీసుకుంటుంది. ఏకంగా 25 లక్షల మంది 45 నుంచి 65 సంవత్సరాల మహిళలకు మంచి చేస్తూ వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద వారికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లల్లో రూ.75వేలు ఇస్తూ.. ఇప్పటి వరకూ రూ.14,110 కోట్లు అందించాం. రిలయన్స్, అమూల్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసి, బ్యాంకులతో అనుసంధానం కలిపి వారు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్‌నకు మంచి మార్గం చూపించాం. ఇక, రాజకీయ పదవుల్లోకొస్తే మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లోనే కాకుండా నామినేషన్‌ పనుల్లోనూ 50శాతం వాటా మహిళలకు దక్కాలని చట్టాన్ని చేసిన ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మేం గర్వంగా చెప్పుకుంటాం.  

మోసాల బాబు.. మహిళోద్ధారకుడా..?
‘రామోజీరావు..! డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన చంద్రబాబు మీకు మహిళోద్ధారకుడిగా కనిపిస్తున్నాడా..? రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధికి, మహిళల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు బాటలు వేస్తోన్న జగనన్న పాలన చూసి దుష్టచతుష్టయమైన చంద్రబాబు, రామోజీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు, బాబు దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు ఏ పథకం అమలు చూసినా .. ఎక్కడా లంచాలకు తావులేదు. వివక్ష లేదు. రికమెండేషన్లు కూడా లేవు. మా జగనన్న బటన్‌ నొక్కగానే నేరుగా మహిళల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. అందుకే, ఆయన్ను ఆత్మీయసోదరుడిగా భావించి ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టినా.. ఆదరించేందుకే వేలాదిగా డ్వాక్రా మహిళలు తరలివచ్చి ముందు వరుసలో కూర్చొంటున్నారు. అదే, రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబు, సున్నావడ్డీ పథకం అమలు చేయని చంద్రబాబు, డ్వాక్రాసంఘాల్ని ఎన్‌పీఎలుగా మొండి బకాయిదార్లుగా మార్చిన ఈ చంద్రబాబు మీకు మహిళోద్ధారకుడిగా కనిపిస్తున్నాడా రామోజీ.. మీరు పెద్ద డ్రామోజీ. ఈనాడు అడ్డగోలు రాతల్ని డ్వాక్రాసంఘాలు ఎన్నటికీ నమ్మబోవు. 

31 లక్షల ఇళ్లపట్టాలందుకున్న మహిళల కళ్లల్లో వెలుగు
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు వారి పేర్లతోనే ఇంటిస్థలాలిచ్చిన ఘనమైన ప్రభుత్వం మాది. పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా చకచకా సాగిపోతున్నాయి. అవి పూర్తయితే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్లు అవుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఈనాడు కళ్లకు కనిపించడం లేదా..? ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలందుకున్న ప్రతీ మహిళల కళ్లల్లో వెలుగులు మీకు కనిపించడం లేదా..? అని చంద్రబాబును , పచ్చమీడియాను నేరుగా అడుగుతున్నాను. 

బాబు పాలనలో మహిళలపై అరాచకాలు గుర్తులేవా..?
ఆనాడు చంద్రబాబు హయాంలో ఇసుకలూటీని నిలురించబోయిన ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడికి పాల్పడం.. ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చడం గుర్తులేదా రామోజీ..? అదేవిధంగా డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలను రోడ్డుపైకి ఈడ్చడం .. పెందుర్తిలో దళిత మహిళను రోడ్డుమీదికి లాక్కొచ్చి వివస్త్ర చేసిన అరాచకం.. ఇంకా రిషితేశ్వరి మరణం ఇవన్నీ ఆనాడు ఈనాడు పత్రికలోనే రాయలేదా..? ఇకనైనా బుద్ధితెచ్చుకుని బాబు, దుష్టచతుష్టయం  వాళ్లతీరును మార్చుకోకపోతే డ్వాక్రా అక్కచెల్లెమ్మల ఆగ్రహానికి గురికాకతప్పదు.

Back to Top