లోకేష్‌వి శవరాజకీయాలు  

హోం మంత్రి సుచరిత 

గుంటూరు: నారా లోకేష్ శవరాజకీయాలు చేస్తున్నాడని, వ్యక్తిగత కారణాలతోనే కర్నూలు ఘటన జరిగిందని ప్రజలే చెప్తున్నారని హోం మంత్రి సుచరిత అన్నారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని, అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని మంత్రి సుచరిత మండిపడ్డారు.

లోకేష్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారా?
 చంద్రబాబు, లోకేష్ నాయకత్వంపై నేతలకు నమ్మకం లేదని, సీఎం వైయ‌స్‌జగన్ సంక్షేమ పాలన చూసి టీడీపీ భయపడుతోంది ఎమ్మెల్సీ ఇక్బాల్ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ..లోకేష్‌ ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు. అండర్ వరల్డ్ డాన్స్‌తో లోకేష్‌కు సంబంధాలున్నాయా అని నిలదీశారు. ఏపీలో సీబీఐని నిషేధించింది బాబు కాదా అని ప్రశ్నించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top