అమరావతి: రాష్ట్రలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిలువరించేందుకు చర్యలు చేపట్టామని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. నేరాలను అరికట్టేందుకు ఆన్‌లైన్ గేమింగ్స్‌ను రద్దు చేస్తున్నామని తెలిపారు. యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు సీఎం వైయస్ జగన్ చట్టంలో మార్పులను సూచించారని తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ..గేమింగ్ హౌస్ గా మారింది. గతంలో ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా ఉండేది కాదు. దీని బారిన పడి యువత తమ భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. ఇందుకోసం దొంగతనాలు చేయడం, తల్లిదండ్రులను బెదిరించడం జరుగుతోంది. డబ్బులు కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పొయిన పరిస్థితి చూశాం. కొంత మంది మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డారు. కొత్త గేమింగ్ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. సైబర్ ట్రెట్ కూడా ఎక్కువైంది. జూద గ గృహాలు నిరంతరం అందుబాటులోకి వస్తోంది. ఇంటర్‌నెట్ గేమింగ్‌కు ఒక చట్టబద్ధత లేకపోవడంతో సులభతరంగా మోసం చేస్తున్నారు. ఆన్‌లైన్ జూదాన్ని చట్టపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు గమనించి చట్టంలో సవరణలు చేస్తున్నాం. గతంలో ఉన్న శిక్షలు కూడా పెంచుతున్నాం. గతంలో మొదటి నేరం చేస్తే ఒక నెల నుంచి ఆరు నెలలు మాత్రమే ఉండేది. దీన్ని మూడు నెలల నుంచి ఏడాది వరకు పెంచాం. రెండోసారి అదే నేరానికి పాల్పడితే కనిష్ట శిక్షాకాలం ఆరు నెలలు గరిష్టంగా రెండు సంవత్సరాలు ఉంటుంది. ఐదు వేల వరకు జరిమానా విధిస్తారు. మూడు సారి అదే నేరానికి పాల్పడితే..ఏడాది నుంచి రెండేళ్లకు తగ్గకుండా శిక్ష విధిస్తూ రూ.10 వేల జరిమానా విధిస్తారు. గతంలో ఎస్ఐ ర్యాంకు అధికారులు గేమ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. సీఎం వైయస్ జగన్ చట్టంలోని మార్పులు గమనించి సవరణలు చేశారు. దీన్ని గమనించి మార్పులకు ఆమోదం తెలపాలని మంత్రి మేకతోటి సుచరిత కోరారు.