రాష్ట్రంలో కొత్త‌గా 17 వేల జ‌గ‌న‌న్న కాల‌నీలు

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెర‌కువాడ శ్రీ‌రంగ‌నాథ‌రాజు

విజయనగరం: రాష్ట్రంలో కొత్త‌గా 17 వేల జగనన్న కాలనీలు రాబోతున్నాయని గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి చెర‌కువాడ శ్రీరంగనాథ రాజు చెప్పారు. పేదలందరికీ ఇళ్లు, జగనన్న కాలనీలపై మంత్రి శ్రీ‌రంగనాథరాజు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పేద‌రిక‌మే ప్రామాణికంగా రాష్ట్రంలోని నిరుపేద‌లంద‌రికీ ఇళ్ల స్థ‌లాలు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తిచేస్తామ‌న్నారు. తొలి విడతలో విజయనగరం జిల్లాలో 98వేల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.  గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఆర్థికాభివృద్ధి పెరుగుతోందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top