ఓటీఎస్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం

మంత్రి శ్రీరంగనాథరాజు
 

పశ్చిమ గోదావరి: జగనన్న శాశ్వత సంపూర్ణ గృహ హక్కుపథకం(ఓటీఎస్‌)పై టీడీపీ, కొన్ని ఛానల్స్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరన్నారు. ఓటీఎస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ  మండిపడ్డారు. ఓటీఎస్‌ విషయంలో పేదలను ఎవరూ బలవంతం పెట్టడం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని.. ఆయన విమర్శలు అర్థరహితమంటూ తెలిపారు. 30 లక్షల మందికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సొంతంగా ఇళ్లు కట్టించి ఇస్తోందని సజ్జల పేర్కొన్నారు. ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ చేసి మరి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని  స్పష్టంచేశారు.

చంద్రబాబు అధికారంలో ఉండగా కనీసం వడ్డీ కూడా మాఫీకి ఒప్పుకోలేదన్నారు. రుణం ఉన్నవారే రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రుణం లేకుంటే 10 రూపాయలతోనే రిజిస్ట్రేషన్ చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకంలో బలవంతం ఏమి లేదు.. ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందంటూ పేర్కొన్నారు. కావాల్సిన వాళ్ళు చేయించుకోవచ్చు.. వద్దు అనుకునే వాళ్ళు అలానే ఉంచుకోవచ్చన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం వాళ్లపై ప్రేమే ఉంటుందని.. చెయ్యాల్సిన మంచి చేస్తామంటూ మంత్రి శ్రీ‌రంగ‌నాథ‌రాజు స్పష్టం చేశారు.  

Back to Top