ప్ర‌జా సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

సచివాలయం: ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు చేపట్టారని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్నారని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ప్రజల బాగు కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచన చేశారా..? అని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలు, మైనార్టీల సంక్షేమం, అభివృద్ధిపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 217 జీఓపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఆక్వారంగం ఎలా ఉంది..? ఇప్పుడెలా ఉందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో హార్బర్‌ ఉండేలా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్యలు చేపట్టారన్నారు. విద్యుత్‌ సబ్సిడీలను ఇచ్చి ఆక్వారంగాన్ని ఆదుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top