గర్జన తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయ్

ప‌శుసంవ‌ర్థ‌క శాఖ‌, మ‌త్స్య శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

ప్రజాస్వామ్య హంతకులే.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా..?

మంత్రులపై దాడి చేయడం ఏ ప్రజాస్వామ్యమో చంద్ర‌బాబు చెప్పాలి..?

నాడు మీ తల్లిని తిట్టించిన తిట్లు, నేడు ఆశీర్వచనాలయ్యాయా ప‌వ‌న్‌..?

విడిపోయిన బంధం మళ్లీ కలవటానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్ చెప్పాలి..?

175 స్థానాల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టిస్తే.. ప్యాకేజీ తీసుకోలేద‌ని న‌మ్ముతాం

అటు నిజ జీవితం, ఇటు రాజకీయాల్లోనూ పవన్‌ది అనైతికతే 

ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ అంటే పచ్చమందకి భయం..

తాడేప‌ల్లి: పవన్‌ కల్యాణ్‌కు దమ్ముంటే, జనసేన పార్టీ టీడీపీ అనుబంధ విభాగం కాకుంటే, పవన్‌ ప్యాకేజీ తీసుకోలేదని నిరూపించుకోవాలనుకుంటే వచ్చే ఎన్నికల్లో 175 చోట్ల పోటీ చేయాలని, అప్పుడు ప్యాకేజీ తీసుకోలేదని నమ్ముతామని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని, ప్యాకేజీలు తీసుకునే వ్యక్తిని ప్యాకేజీ స్టారే అంటారన్నారు. గతంలో మీ తల్లిని తిట్టించిన టీడీపీ, ఎల్లో మీడియా తిట్లు నేడు ఆశీర్వచనాలయ్యాయా..? అని పవన్‌ను ప్రశ్నించారు. విడిపోయిన బంధం మళ్లీ కలవడానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. విశాఖ గర్జన తరువాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయని ఎద్దేవా చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామ్య పరిస్థితులు ఏం ఉన్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రులపై దాడి చేయడం ప్రజాస్వామ్యమా..? మంత్రులపై దాడిచేసిన వారిని పరిగెత్తుకుంటూ వెళ్లి పరామర్శిస్తారా..? అని నిలదీశారు. ప్రస్తుత మంత్రి  రోజాను గతంలో ఏడాదిపాటు సస్పెండ్‌ చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా..? చంద్రబాబుకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకువచ్చిందా..? అని మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. 

మంత్రి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారంటే.. 
చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లు నోవాటెల్ హోటల్ లో కలిసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మీడియా ముందుకు వచ్చారు. విశాఖ గర్జన, ఉత్తరాంధ్ర సింహ గర్జన తర్వాత ఊరకుక్కలన్నీ ఏకమవుతున్నాయనిపిస్తుంది. విశాఖలో గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులపై దాడి చేసిన వారిని, దాడికి ప్రోత్సహించినవారికి మద్దతు తెలిపిన వారిని పరామర్శించడం ఎక్కడైనా ఉంటుందా..?. ఉత్తరాంధ్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మంత్రులపై దాడులు చేయించావు అంటే, ఇది ఉత్తరాంధ్రకు మీరు చేస్తున్న ద్రోహం కాదా..?. అంటే ఉత్తరాంధ్రకు ఎవరూ మద్దతు పలక కూడదా.. పలికితే దాడులు చేయిస్తారా..?

దాడులు చేసిన వారిని పరామర్శించడమా..?
విశాఖ రాజధాని కావాలని.. విశాఖే రాజధానిగా రావాలని లక్షలాది మంది జోరు వర్షంలో కూడా రోడ్డు మీదకు వస్తే.. ఆ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా, దాడులు చేయించి, గర్జనను డైవర్ట్ చేయాలని, మా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను దెబ్బ కొట్టాలని చంద్రబాబు-పవన్ లు కలిసి చేసిన కుట్ర కాదా ఇది.. ?. మేం గర్జన చేస్తున్న రోజే.. పవన్ కల్యాణ్ విశాఖ రావడం వీరిద్దరి కుట్రలో భాగం కాదా..?. ఆ తర్వాత మంత్రుల మీద జనసేన కార్యకర్తలు దాడులు చేస్తే.. దాడులు చేయించిన పవన్ ను పరామర్శించడానికి బాబు పరిగెత్తుకుని రావడం చూస్తే, దాని వెనుక రాజకీయం ఏమిటో రాష్ట్ర ప్రజలకు అర్థం కావటం లేదా..?

విశాఖ రాజధాని కావాలని మేం గర్జించడం దౌర్జన్యమా.. లేక మీరు మంత్రులపై దాడులు చేయడం దౌర్జన్యమా..? దాడి చేసిన వారిని పరామర్శించడం దౌర్జన్యమా.. లేక దాడికి గురైన వారిని పరామర్శించకపోవడం దౌర్జన్యమా..? చంద్రబాబులో ఏమి నచ్చి, మళ్ళీ చంద్రబాబుతో కలిశాడో పవన్ కల్యాణ్ చెప్పాలి. 

గతంలో తన కుటుంబాన్ని దూషించారని, తన అమ్మను దూషించారని, ఖబడ్దార్ చంద్రబాబు, తెలుగుదేశం, ఎల్లో మీడియా..  అని బీరాలు పలికిన నీవేనా ఈరోజు మాట్లాడేది. మీ అమ్మను తిట్టించిన చంద్రబాబు అంతమే.. నా లక్ష్యమన్న  నీ స్వరంలో ఎందుకు మార్పు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబులో ఏం మారింది.. మేము కూడా సినిమాల పరంగా చిరంజీవి అభిమానులమే. మీ తల్లిని తిడితే మీకు రోషం లేదేమోగానీ, చిరంజీవి తల్లి అంటే మాకు గౌరవం. మేము కూడా ఆ వ్యాఖ్యలను అప్పట్లో ఖండించాం. ఆరోజు మీ తల్లిని తిడితే.. అవి ఈరోజు మీకు ఆశీర్వచనాల్లా కనిపిస్తున్నాయా.. నీకు రోషం, సిగ్గు లేదా..?

బాబు దగ్గర ప్యాకేజీ.. 
పవన్ కల్యాణ్ తన పెళ్ళిళ్ళ గురించి చెబుతూ.. మొదట ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం, ఆ తర్వాత నచ్చకపోతే ప్యాకేజీలు ఇచ్చి వారిని వదిలించుకున్నాని, అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాని, మీరు  కూడా నాలా, విడాకులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకోవచ్చని ఒక కొత్త  సిద్ధాంతం చెప్పాడు. పవన్ కల్యాణ్ మాటల్లో..  మాకు అర్థమైంది ఏమిటంటే..  పెళ్ళిళ్ళు చేసుకోవడం.. మహిళల్ని వాడుకోవడం.. ఆ తర్వాత చంద్రబాబు దగ్గర తీసుకున్న ప్యాకేజీల్లో కొద్దోగొప్పో ఇచ్చి.. వారికి విడాకులు ఇచ్చి వదిలించుకోవడం.. ఇదే పవన్ పెళ్ళిళ్ళ సిద్ధాంతం. ఇది  ఆయనకు పరిపాటిగా మారింది. విడిపోయిన చంద్రబాబుతో మళ్ళీ కలవటానికి.. ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో పవన్ కల్యాణ్ చెప్పాలి. 

మా ఉత్తరాంధ్ర ప్రజల గుండెల మీద తన్నటానికి, మమ్మల్ని దూషిస్తూ, మమ్మల్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు తన మనుషులను అమరావతి పాదయాత్ర పేరుతో పంపిస్తున్నాడు. ఇది విద్వేషాలను రెచ్చగొట్టడం కాదా.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా.. చంద్రబాబు లాంటి ఊర కుక్కలే ఇది చేస్తుంది నిజం కాదా.. ?. బాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని తానా తందాన అంటున్నది పవన్ కల్యాణ్ లాంటి ఊర కుక్కలు కాదా..?

ఏ దేశంలో అయినా ఇది సాధ్యమా..?
పవన్ కల్యాణ్.. నా కొడకల్లారా, తేల్చుకుందాం.. అంటూ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన రెచ్చిపోయి మాట్లాడుతుంటే..  ఆయన పార్టీ అభిమానులు మరింత రెచ్చిపోతూ క్లాప్స్ కొట్టడం చూశాం. ఆయన మాటలకు ఎల్లో మీడియా ఈనాడుగానీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిగానీ, టీవీ 5 గానీ బాకాలు ఊదటం, వీటన్నింటికీ చంద్రబాబు మద్దతు పలకడం.. ఆశ్చర్యం వేసింది. ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా ఇది సాధ్యమా..?. 

రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగే విధంగా.. కులాలకు, మతాలకు,  పార్టీలకు అతీతంగా పేద  కుటుంబాలకు దాదాపు రూ. 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి, వారి సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ ప్రభుత్వం తోడ్పడుతుంది వాస్తవం కాదా..?

మీరు చేసిన మంచి ఏమిటో చెప్పలేక, మళ్ళీ అవకాశం ఇస్తే.. ఇది చేస్తామని చెప్పుకునే పరిస్థితి లేక.. ఆఖరికి చెప్పులు చూపించుకునే  పరిస్థితి పవన్ కల్యాణ్ కు వచ్చింది. పవన్ ను ప్యాకేజీ స్టార్ అనక ఏమంటాం. ఆయన సినిమాల్లో నటిస్తూ,   ప్రతి సినిమాకు ఒక ప్యాకేజీ తీసుకుంటాడు. అలానే ఖాళీ సమయాల్లో, చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేసి మళ్ళీ కొత్త ప్యాకేజీ వచ్చే వరకు కనిపించకుండా వెళతాడు. 

175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పు
పవన్ కల్యాణ్ కు దమ్ముంటే.. ఆయనదొక రాజకీయ పార్టీనే అయితే, జనసేన పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగం కాకపోతే.. నువ్వు ప్యాకేజీ తీసుకోలేదని నిరూపించుకోవాలంటే, నువ్వు ప్యాకేజీ స్టార్ వి కాకపోతే.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పే ధైర్యం నీకు ఉందా..?. అది లేనప్పుడు నిన్ను ప్యాకేజీ స్టార్ అనక, ఇంకేమంటారు..?

నేను యుద్ధానికి సిద్ధం అని పవన్ కల్యాణ్ అంటున్నాడు.  ఏ యుద్ధానికి సిద్ధం. ఫాం హౌస్ లో యుద్ధానికే కదా నువ్వు సిద్ధం..?. ఇప్పటికైనా నీ కోసం చొక్కాలు చింపుకునే నీ ఫ్యాన్స్ కు నిజం చెప్పు పవన్ కల్యాణ్. నీ గురించి తెలియక, నీ మాటలకు, చేష్టలకు వారు ఆవేశపడిపోతున్నారు. నీ యుద్ధాలన్నీ రాత్రి పూటే తప్పితే.. పగటి పూట కాదని నీ సైనికులకు చెప్పు. పవన్ కు ఏ విలువలూ లేవు. నైతికత లేదు. ఒక భార్య ఉండగానే, మరో ఆవిడతో పిల్లల్ని కనడం నైతికతా..? అవే విలువలా..?. నీకు కుటుంబ విలువల్లోనూ, రాజకీయాల్లోనూ నైతికత లేదు కాబట్టే ప్రజలు నిన్ను పోటీ చేసిన రెండు చోట్లా తిరస్కరించారు.

మంత్రులపై దాడి చేయడం ఏ ప్రజాస్వామ్యం..?
ప్రజాస్వామ్య పరిరక్షణ అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు ఏమి ఉన్నాయో చెప్పాలి. తాగేసి, పిచ్చి కుక్కల మాదిరి, సైకోల మాదిరిగా ప్రవర్తిస్తూ, మీ వందిమాగధులతో నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. మంత్రులపైన దాడి చేయడం ప్రజాస్వామ్యమా..? మంత్రులపై దాడులు చేసిన వ్యక్తులను పరామర్శించడానికి నువ్వు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వస్తావా బాబూ..?

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేశావు, అందులో నలుగురిని మంత్రులను కూడా చేశావు, ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశావు, ప్రతి పక్ష నాయకుడిగా ఉన్న వైయ‌స్‌ జగన్ హక్కులు కాలరాసి, శాసనసభలో మైకు ఇవ్వకుండా, బూతులు తిట్టిస్తూ,  పైశాచిక ఆనందం పొందింది మీరు కాదా చంద్రబాబూ.. ఆరోజు   ప్రజాస్వామ్యం గురించి ఎందుకు మాట్లాడలేదు. మీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయబట్టే.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయబట్టే.. సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి ఒక హీరోలా.. అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసి బయటకు వచ్చి.. చరిత్రాత్మకమైన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రజాస్వామ్యం గెలిచింది కాబట్టే, నిన్ను, నీ పార్టీని 23 సీట్లకు ప్రజలు పరిమితం చేశారు. ప్రజాస్వామ్య హంతకులే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే.. నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 

టీవీ చానళ్ళల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్ ల ముసి ముసి నవ్వులే అంతా చూశారు.. నేను అయితే.. వారు బయటకు వస్తుండగా, తడిసిపోయిన వారి ప్యాంట్లు చూశాను. మున్ముందు ఇంకా మీ ప్యాంట్లు తడుస్తాయి కాబట్టే, ఊర కుక్కలన్నీ ఏకమవుతున్నాయి. బయటికి బీజేపీతో వివాహం అని కలరింగ్ ఇస్తూ.. లోపల చంద్రబాబుతో అక్రమ సంబంధం నడుపుతున్నావు. నిజ జీవితంలో ఉన్నట్టే.. రాజకీయాల్లో కూడా అలానే ఉన్నాడు పవన్ కల్యాణ్.. 

పేదలకు డీబీటీ ద్వారా నేరుగా డబ్బులు పంచడం నేరమా..  ప్రతి పేదవాడు చదువుకోవాలని అమ్మ ఒడి ఇవ్వడం నేరమా.. మహిళలకు చేయూత ఇవ్వడం నేరమా.. ఆసరా ఇవ్వడం నేరమా.. గ్రామాల్లో సచివాలయాలు పెట్టి గ్రామాలకే పరిపాలన తీసుకెళ్ళడం నేరమా..? ఇవన్నీ రాజ్యంగ విరుద్ధమా..? ఇందులో ఏది నచ్చక పవన్ కల్యాణ్ చంద్రబాబుతో చేతులు కలిపాడు. చంద్రబాబులో ఏదో తెలియని సమ్మోహన శక్తి పవన్ కల్యాణ్ ను రా.. రా.. అని ఆకర్షించింది. రాష్ట్రంలో ఉన్న అత్యంత అప్రజాస్వామికవాది చంద్రబాబు...  ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. 

వైయ‌స్ జగన్ అంటే పచ్చమందకి భయం.. భయం..
ఉద్యమాల పురిటి గడ్డ మా ఉద్దానం ప్రాంతం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడిన విప్లవ కెరటం... 
ఒక చేతిలో పెన్ను, మరొక చేతిలో గన్నుతో ఉద్యమాన్ని నడిపిన విప్లవ యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి మాటలు చూస్తే... 

ఎరుపంటే కొందరికి భయం.. భయం..
పసి పిల్లలు వారి కన్నా నయం.. నయం..
- ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి

మరి ఆ 'ప్రాస' నేడు ఈ పచ్చ మంద ప్రవర్తిస్తున్న తీరుకు అన్వయిస్తే.. 

వైయ‌స్ జగన్ అంటే పచ్చమంద కి భయం.. భయం..
ఆంధ్ర రాష్ట్రం కోరుకుంటుంది మాత్రం జగనిజం..
అభివృద్ధి-సంక్షేమమే మా పాలనకు నిదర్శనం..
సమసమాజ స్థాపన వైయ‌స్ జగన్ లక్ష్యం..
కుల, మత, రాజకీయ భేదాలు మాకు అనవసరం..
ఇది గమనించడం లేదు పచ్చమంద పాపం..
అసత్య ఆరోపణలు చేయడమే వారి నైజం..
మరచిపోతున్నారు.. ప్రజలు గమనిస్తున్నారన్న విషయం..
ఇప్పటికైనా తెలుసుకోవాలి ఈ పచ్చ మంద నిజం..
ఆ భగవంతుడు ప్రసాదించాలి వీరికి జ్ఞానం. 

మూడు రాజధానులంటే మీకెందుకు మంట..?
మూడు రాజధానులు అనేది.. విప్లవాత్మకమైన నిర్ణయం. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అంతా ఏకీకృతమైతే.. ఏం జరిగిందో మనం చూశాం. అదే బాటలో అమరావతిలోనే సంపదనంతా పోస్తే..  మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మరింత వెనక్కి వెళ్ళాల్సిందేనా.. ? రాజధాని ఏర్పాటుపై.. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేసి, అభివృద్ధిని, పరిపాలనను వికేంద్రీకరించండి అని చెప్పిన మాటను ఈరోజు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. దీనికి అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని వయసుల ప్రజలు మద్దతు పలుకుతుంటే.. వీరికి మాత్రమే ఎందుకు కడుపు మంట..?

గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు రాసిన.. ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నీవే, ఏకీకృత అభివృద్ధి కరెక్టు కాదు అని మాట్లాడిన నువ్వే.. ఈరోజు మళ్ళీ అమరావతి పాట పాడుతున్నావంటే.. ప్యాకేజీ తీసుకోలేదంటే నిన్ను ఎవరు నమ్ముతారు.?. నువ్వు ప్యాకేజీ కోసం, ప్యాకేజీతోనే రాజకీయాలు చేస్తావని నీవే స్పష్టమైన సంకేతాలు ఇచ్చావు.  విశాఖలో పరిపాలన రాజధాని కావాలన్న  మా ఉద్యమం కచ్చితంగా ముందుకు వెళుతుంది. అమరావతి మాత్రమే రాజధాని కావాలనే మీ యాత్రను కచ్చితంగా వెనక్కు రప్పించాలి, వెంటనే, చంద్రబాబు తన మనుషులను వెనక్కి రప్పించాలి. లేకపోతే.. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినట్టే అవుతుంది. 

అమరావతి కొందరిదే.. అడ్డుకుని తీరుతాం,  అమరావతిలో అభివృద్ధి ఏకీకరణకు వ్యతిరేకంగా పుస్తకాలు అవిష్కరించి, రైతుల తరఫున పోరాటం చేస్తామన్న పవన్ కల్యాణ్ వీడియోలు కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఆరోజు  పాచిపోయిన లడ్డూలు.. ఈరోజు తియ్యగా మారిపోయాయా.. ఏ లక్ష్యంతో చంద్రబాబుతో జత కడతావ్..? అమరావతి మీద నీ విధానం నిన్నొకలా.. ఈరోజు ఒకలా ఎందుకు ఉంది. 2018-19లో ఒకలా.. 2019 తర్వాత నీ విధానం ఎలా మారింది, ఎందుకు మారిందో చెప్పు..? 

Back to Top