చంద్రబాబులాంటి ఛీటర్ దేశంలోనే లేడు

పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ధ్వజం

బాబు పిట్టకథలకు.. పచ్చ మీడియా పిచ్చి కథలకు పుట్టిందే టీడీపీ చార్జిషీట్

తొలి సంతకాలనే నెరవేర్చలేని దద్దమ్మ చంద్రబాబు

ప్రతి పథకానికి లబ్ధిదారుల నుంచి లంచం వసూలు చేసిన చరిత్ర బాబుది

14 ఏళ్లు సీఎంగా చేసి అమ్మకు వందనం, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగభృతి ఎందుకు అమలు చేయలేదు..? 

మేనిఫెస్టో విలువ పెంచేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

అవినీతి, వివక్షకు చోటులేకుండా ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

సీఎం వైయ‌స్ జగన్ 4 ఏళ్ల‌ పాలనలో నాలుగు తరాల సంక్షేమం

న్యాయ వ్యవస్థను కించపరిచిన "పచ్చ మంద"పై చర్యలు తీసుకోవాలి

వివేకా హత్య కేసులో.. వ్యక్తి టార్గెట్‌గా సీబీఐ విచారణ అభ్యంతరకరం

తిరుపతి:  తల్లి మనసుతో ఆలోచిస్తూ, తండ్రిలా బాధ్యత తీసుకొని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి మేలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థను నెలకొల్పి పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకు చేర్చారని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 722 సేవలను ప్రజలు ఉచితంగా అందుకుంటున్నారని చెప్పారు. పాదయాత్రలో తాను చూసిన ప్రజల సమస్యలను అధికారంలోకి వచ్చిన తరువాత పరిష్కరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి నాయకుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి.. మేనిఫెస్టో ఎంత పవిత్రమైనదో తెలుసుకునేలా చేసిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని మంత్రి రోజా అన్నారు. తిరుపతిలో మంత్రి రోజా విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి రోజా ఏం మాట్లాడారంటే.. 

వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి నిన్నటికి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మీ అందరితో నేను కొన్ని విషయాల్ని పంచుకుంటున్నాను. ఈ నాలుగేళ్లల్లో నాలుగు తరాలు గుర్తుంచుకోదగ్గ సంక్షేమాన్ని మా నాయ‌కుడు వైయ‌స్‌ జగన్‌ అందించారని, వారి కేబినెట్‌లో మంత్రిగా నేను ఈరోజు గర్వంగా చెబుతున్నాను. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల కష్టాల్ని నేరుగా చూసి ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అని ప్రజలకు ఒక నమ్మకాన్ని-భరోసాను కలిగించారు. ఈ నాలుగేళ్లల్లో ప్రజలకిచ్చిన నమ్మకాన్ని ఆయన వమ్ము చేయకుండా సుభిక్షమైన పరిపాలనతో వారందరి జీవితాల్లో వెలుగులు నింపారు.

బాబు పిట్టకథలకు, పచ్చ చానళ్ళ పిచ్చి కథలకు పుట్టిన విషపుత్రిక అది..
ఈరోజు సీఎం వైయ‌స్‌ జగన్‌ నాలుగేళ్ల పాలన గురించి నాలుగు మాటల్లో చెప్పాలంటే, సంక్షేమం, సుస్థిరత, సాధికారత, సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆయన పాలన అందిస్తున్నారు. ఈ నాలుగేళ్ల వైయ‌స్‌ జగన్‌ పరిపాలనను చూసి నవనాడులు చిట్లిపోయి.. నవరంధ్రాల్లో రక్తం చూసిన చంద్రబాబు ఇప్పుడు ఏవిధంగా తయారయ్యాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నిన్న వైయ‌స్‌ జగన్‌ పాలనపై ప్రజా చార్జిషీట్‌ అంటూ ఒక బోగస్ పత్రాన్ని విడుదల  చేశారు. ఎందుకంటే, చంద్రబాబు పిట్టకథలకు.. పచ్చ చానళ్ళ పిచ్చి కథలకు పుట్టిన విషపుత్రిక ఈ చార్జిషీట్‌ అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఈరోజు వైయ‌స్‌ జగన్‌ అందిస్తున్న సుస్థిరమైన పాలనతో ప్రజలంతా సంతోషంగా ఉంటే, కడుపుమంటతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు మాత్రం రోజుకో విన్యాసంతో వెర్రెక్కిపోతున్నారు. 

బాబు ఇచ్చిన 600 పైగా హామీల్లో.. ఆరైనా నెరవేర్చలేదు
వైయ‌స్‌ జగన్‌ పరిపాలనలో నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో నమ్మకం కలిగింది. సరైన, సమర్ధుడైన నాయకుడు తమకు ముఖ్యమంత్రిగా వచ్చారని అందరూ భావిస్తుంటే.. చంద్రబాబు టీమ్‌ మాత్రం ఆ విషయాన్ని తట్టుకోలేకపోతుంది. 
ఈ సందర్భంగా బాబును ఒక ప్రశ్న అడుగుతున్నాను.
- 2014 ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన 600కి పైగా హామీల్లో నువ్వు అధికారంలోకి వచ్చాక కనీసం ఆరు హామీలనైనా నెరవేర్చావా..? అని అడుగుతున్నాను. ఇందుకు బాబు సమాధానం చెప్పాలి. అదే, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో ఇప్పటికే 98.5 శాతం హామీల్ని అమలు చేసి, మాట నిలబెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నప్పుడు.. బాబు పిచ్చి చార్జిషీట్‌లో మాది మోసకారి ప్రభుత్వం అని ఏవిధంగా చెబుతారని ప్రశ్నిస్తున్నాను. ఈ విషయంపై బాబు గానీ.. ఆయన పార్టీ నాయకులైనా చర్చించేందుకు సిద్ధమా..? అని సవాల్‌ విసురుతున్నాను. దమ్ముంటే, వారంతా టీడీపీ మేనిఫెస్టోను పట్టుకుని మాతో చర్చకు రావాలంటున్నాను. 

బాబు తొలిసంతకాలకే విలువలేదు
2014లో నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన తొలి ఐదు సంతకాలనే ఎందుకు నెరవేర్చలేకపోయావు బాబూ..? అని అడుగుతున్నాను. రైతు రుణమాఫీ, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ, మద్యం బెల్టుషాపుల రద్దు, రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్, సామాజిక పింఛన్ల పెంపు అనే తొలి సంతకాల హామీల్ని గాలికొదిలేసిన దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే తొలిసంతకం పెట్టిన తర్వాత దానిని తక్షణం అమలు చేయడమనేది మహానేత డాక్టర్ వైయ‌స్‌ఆర్‌ పాలనలో చూశాం. మళ్ళీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పాలనలో చూస్తున్నాం. కానీ, తాను పెట్టిన తొలిసంతకాలకే విలువలేకుండా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. అది చంద్రబాబు మాత్రమేనని చెప్పాలి. దాన్నే అసలైన మోసపూరితమైన పరిపాలన అని అంటారు. మోసానికి గడ్డం మీసం పెడితే అది చంద్రబాబులాగానే కనిపిస్తుంది. ఆ విధంగా మోసపూరిత మాటలతో పచ్చఛానెళ్లను అడ్డంపెట్టుకుని ఐదేళ్లు పాటు ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. 

మనుసున్న నాయకుడు వైయ‌స్‌ జగన్‌ 
తాను ఉన్నాను.. విన్నానంటూ.. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా పవిత్రంగా తీసుకుని అందులో చెప్పిన ప్రతీ హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నాయకుడు మా వైయ‌స్‌ జగన్‌ అని మేం గర్వంగా చెబుతున్నాం. ఆయన తన పరిపాలనతో ప్రజల కష్టాల్ని దూరం చేస్తూ మహిళలు, విద్యార్థులు,  రైతులు, శ్రామికులు, వ్యాపారులు ఇలా అందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఆయా వర్గాలకు డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు.. పైసా లంచం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన ఏకైక ప్రభుత్వం మాది. కుల, మత, ప్రాంత, రాజకీయాల్ని చూడకుండా రాష్ట్రంలోని అన్నివర్గాల పేద ప్రజలు బాగుపడాలని కోరుకున్న గొప్ప మనసున్న నాయకుడు వైయ‌స్‌ జగన్‌ ని రాష్ట్ర ప్రజలు ఘనంగా చెప్పుకుంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఈ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లే దుష్ప్రచారానికి ఒడిగట్టి ప్రజల్ని నమ్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు.

బాబు పాలనలో అవే గోల్డ్‌ మెడల్స్‌
 నిజానికి, బాబు అండ్‌ కో.. విడుదల చేసిన చార్జిషీట్‌లో ఉన్న నేరాలు, ఘోరాలు, దందాలు, దోపిడీలు, లూటీలు, విధ్వంసాలు, విధ్వేషాలన్నీ చంద్రబాబు ప్రభుత్వానికే వర్తిస్తాయి. వీటన్నింటినీ చంద్రబాబు పాలనలో ఆయన అందుకున్న గోల్డ్‌మెడల్స్‌గా చెప్పుకోవచ్చు. కనుక, వీటన్నింటిని మా ప్రభుత్వానికి రుద్దకుండా .. బాబు అండ్‌ కో బృందమే జాగ్రత్తగా దాచుకోవాలని హితవు పలుకుతున్నాను.  నిన్న ఈ ప్రజా చార్జిషీట్‌ విడుదల సందర్భంలో మాట్లాడిన టీడీపీ నేత బొండా ఉమ తానేదో శుద్ధపూస అన్నట్టుగా పెద్దపెద్ద రంకేలేశాడు గదా.. ఆ మహానుభావుడు ఆస్తికోసం విజయవాడలో ఒక తల్లికూతురును ఎంతగా వేధించాడో గతంలో అందరూ చూశారు. అలాగే, టీడీపీ అధికారంలో ఉండగానే బొండా ఉమ భార్యమీద సీఐడీ ఒక కేసును నమోదు చేసిందంటే, అసలైన మోసగాళ్లు ఎవరనేది ప్రజలకు అర్థమవుతుంది. 

బాబు పాలన అంతా లంచాలు, మోసాలే
ఈరోజు చంద్రబాబు మరీ ఎంతగా దిగజారాడంటే, 15వేల మందికి భోజనం ఏర్పాటు చేస్తే.. లక్షమంది తిన్నారంటాడు. ఇంతకన్నా అబద్ధాల లెక్కల మనిషిని మనం ఎక్కడైనా చూస్తామా..? ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పై ఆయన ఇష్టానుసారంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. మరి, 2014లో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాటిని వెలికితీయలేకపోయావా..?అని అడుగుతున్నాను. అంటే, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు గాడిదలు కాస్తున్నావా..? ఏవేవో ఊహాజనిత కబుర్లుతో వైయ‌స్‌ జగన్‌పై బురదజల్లాలని చూస్తున్నావా..? అని అడుగుతున్నాను. ఇలాగే పిచ్చిగా వెర్రికూతలు కూస్తే బాబుకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు తన పర్యటనల్లో వైయ‌స్‌ జగన్‌పై రోజుకో అవినీతి ముచ్చట చెబుతున్నాడు. నాలుగేళ్లల్లో రూ.2.60 లక్షల కోట్ల అవినీతి చేశారంటూ.. బాబు రంకెలేస్తున్నాడు. నువ్వు పచ్చకామెర్లతో వెధవపనులు చేశావని.. అందరూ అలాగే ఉంటారనే భ్రమల్లో నువ్వు బతుకుతున్నావా చంద్రబాబూ..? అని అడుగుతున్నాను. బాబు హయాంలో ఎవరు ఏ చిన్న సర్టిఫికేట్‌ తీసుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఆఖరికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలనుకున్నా లంచం లేనిదే అవి మంజూరు కావు. చంద్రబాబు పాలనంతా లంచాలు, మోసాలే నడిచాయి. 

దేశానికే ఆదర్శంగా సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ
 మరి, మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ పాలనలో సచివాలయ వ్యవస్థ అనేదాన్ని పెట్టి ప్రజలకు ఏం కావాలన్నా కూడా నేరుగా ఇంటిదగ్గర్నే అందించే వలంటీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ వ్యవస్థ ద్వారా దాదాపుగా 722 సర్వీసులు పూర్తిగా ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తుంటే, ఇప్పటికే రాష్ట్రంలో 5 కోట్లమంది ఆ సేవల్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది.  

అధికారంలో ఉండగా పేదలు గుర్తుకు రాలేదా..?
అధికారం పోయేసరికి చంద్రబాబుకు ఇప్పుడు పేదలు గుర్తొచ్చినట్టు ఉన్నారు. మేం ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని కాపీకొట్టి తన భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నాడు. మరి, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు, విద్యార్థులు, రైతులు, పేదలు బాబుకు ఎందుకు గుర్తుకురాలేదని అడుగుతున్నాను. మేం పెట్టిన అమ్మఒడి పథకాన్ని హేళన చేసి మాట్లాడిన చంద్రబాబు... ఇప్పుడు మళ్లీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులిస్తానంటూ ఏవిధంగా చెబుతున్నాడు..? డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రూ.14,600 కోట్లు రుణమాఫీ చేస్తానన్న బాబు, ఒక్క రూపాయి రుణ మాఫీ చేయకుండా,  వాళ్లనెందుకు అప్పుల ఊబిలో తోశాడని నేను అడుగుతున్నాను. మేం ఇప్పుడు అమలు చేస్తున్న ఆసరా, చేయూత లాంటి కార్యక్రమాన్ని ఆరోజు నీహయాంలో ఎందుకు చేయలేకపోయావని బాబును ప్రశ్నిస్తున్నాను. అలాగే, యువతను, రైతుల్ని మోసం చేసిన బాబు, ఇప్పుడేదో ఎన్నికలు వస్తున్నాయనగానే మళ్లీ అబద్ధాల హామీలతో మేనిఫెస్టో అంటూ బాబు ఊదరగొడుతున్నారు. మహానాడులో ఆరోజు బాబు ప్రకటించిన మేనిఫెస్టో ఒక చెత్తబుట్టతో సమానమని ప్రజలంతా నవ్వుకుంటున్నారు. 

తల్లిమనసుతో ఆలోచించి తండ్రిలా బాధ్యత తీసుకుంటూ..
 మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌ ప్రతీ సంక్షేమ పథకాన్ని అక్కచెల్లెమ్మల పేరుతో అందిస్తూ.. వాళ్లకు తోడబుట్టిన సోదరుడుగా ఉన్నారు. ఇంటిస్థలం, బిడ్డల చదువు, వారి ఆరోగ్యం, వారి జీవనశైలి మెరుగుదలపై ఒక తల్లి మనసుతో ఆలోచించి, తండ్రిలా బాధ్యత తీసుకుంటూ ఈ రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సేవచేస్తున్న నాయకుడు.. నవరత్నాల పథకాల్ని అమలు చేస్తున్న దార్శనికుడు మా వైయ‌స్ జగన్ అని గర్వంగా మేం చెప్పుకుంటున్నాం. అలాంటి వ్యక్తిని కాదని.. గతంలో ఎలాంటి మేలు చేయని వ్యక్తిని నమ్మే పరిస్థితి ఉండదు. మహిళలెవరూ చంద్రబాబు మాటల్ని నమ్మరని తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో మహిళలందరి తరఫున ఒక మహిళామంత్రిగా నేను మా నాయకుడు వైయ‌స్‌ జగన్‌కి సెల్యూట్‌ చేస్తున్నాను. 

వ్యక్తి టార్గెట్ గా సీబీఐ విచారణ అభ్యంతరకరం
-వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ విచారణ తీరు చాలా అభ్యంతరకరంగా సాగుతుంది. ఎంపీ వైయ‌స్‌ అవినాశ్‌ ని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వ్యక్తి టార్గెట్‌గా విచారిస్తూ ఆయన్ను ఇరుకున పెట్టాలనే సీబీఐ తీరును ఈరోజు తెలంగాణ హైకోర్టు కూడా గుర్తించిందని భావిస్తున్నాం. సీబీఐకి వైయ‌స్ అవినాశ్‌  సహకరిస్తున్నా కూడా .. రాజకీయాల్లో ప్రత్యర్థులైన కొందరు తప్పుడు సమాచారం అందిస్తూ, తమ అభిప్రాయాల్ని సీబీఐ ద్వారా నెరవేర్చుకుంటున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

పచ్చ మందపై చర్యలు తీసుకోవాలి 
 అలాగే, పచ్చ చానెళ్లల్లో హంతకులు,  సస్పెండైన అధికారుల్ని కూర్చొబెట్టి న్యాయవ్యవస్థపై ఏవిధంతా ఆరోపణలు చేయిస్తూ చర్చలు సాగిస్తున్నారో.. వారు చేసిన కామెంట్లపై ఈరోజు సాక్షాత్తూ తెలంగాణహైకోర్టు జడ్జి వ్యాఖ్యానించిన సంగతి అందరికీ తెలిసిందే. వివేకా హత్య కేసులో ఎంపీ వైయ‌స్‌ అవినాశ్‌ సాక్ష్యాలు తారుమారు చేయాలని ప్రయత్నించారని సీబీఐ కేవలం ఆరోపిస్తుందే తప్పితే,  ఏ ఒక్కదానికీ వారి దగ్గర సాక్ష్యాలేమీలేవు. సీబీఐ చెప్పుడు మాటలకు ప్రభావమవుతుందని, ఊహాజనిత అంశాలతో విచారణ చేస్తున్న సీబీఐని తప్పుబడుతూ హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించడం అందరూ గమనించాలి. ఒక హైకోర్టు జడ్జి అని చూడకుండా.. ఈ పచ్చమంద అభిప్రాయాలకు అనుకూలంగా తీర్పు రాలేదని.. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఈనెల 26న ఏబీఎన్, మహాటీవీల్లో ఎవరైతే చర్చ చేశారో.. వారిని తక్షణమే గుర్తించి  హైకోర్టు సీజేఏ చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను.

Back to Top