కర్నూలు: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తెలంగాణలో డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి పార్లమెంట్ తో పాటు తనను ఎన్నుకున్న ప్రజల పరువు తీశారని కర్నూలు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఘటనలో పోలీసులపై కాల్పులు జరపడం చూస్తుంటే వీరి వెనుక డ్రగ్ మాఫియా ఉన్నట్లు అర్దమవుతోందన్నారు. దీనిపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ లో ఎస్వీ మోహన్ రెడ్డి ఇంకేమన్నారంటే..: డ్రగ్స్ తీసుకుంది కాక పోలీసులపై కాల్పులా !: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎంపీగా ఉండి పార్లమెంట్ కే మచ్చ తెచ్చారు. ఎన్నికల సమయంలో మీ ఓటు ఏపీలో డ్రగ్స్ ను అడ్డుకట్ట వేస్తుందని పత్రికా ప్రకటన వేసుకున్న పుట్టా మహేష్.. ఇవాళ తానే డ్రగ్స్ తీసుకుంటూ దొరికారు. చంద్రబాబు ఇలాంటి వారికి ఎంపీ టికెట్లు ఇచ్చి గెలిపించారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంది కాక పోలీసులపై ఐదు రౌండ్ల కాల్పులు జరపడం దారుణం. ఇదంతా చూస్తుంటే వీరు మాఫియాను నిర్వహిస్తున్నట్లు అర్దమవుతోంది. పోలీసులపై కాల్పులు మాఫియానే చేస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ అక్కడే ఉండి డ్రగ్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరుపుతారా ?. చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి: తెలంగాణలో జరిగిన డ్రగ్స్ పార్టీలో పోలీసులపై కాల్పులు జరిపారంటే.. వీరు డ్రగ్ రాకెట్ నడుపుతున్నారని అర్థమవుతోంది. ఇందులో టీడీపీ పెద్దలకు ప్రమేయముందా ?, వాటాలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి. ఈ అనుమానాల్ని చంద్రబాబు, లోకేష్ నివృత్తి చేయాలి. టీటీడీ ఛైర్మన్ గా పని చేసిన పుట్టా సుధాకర్ యాదవ్ ఇలాంటి సుపుత్రుడిని కన్నారు. తాజాగా ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మహిళతో దొరికిపోయారు. టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండే వారికి క్యారెక్టర్ ఉండాలి. అది లేని వారికి అత్యున్నత పదవులు ఇవ్వకూడదు. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన పదవి ఇది. ఇలాంటి వాళ్లను పార్టీలో పెట్టుకున్న టీడీపీ .. విలువల గురించి మాట్లాడుతోందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆక్షేపించారు.