సాహసాలు, సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్ కృష్ణ‌

మంత్రి ఆర్కే రోజా

హైద‌రాబాద్‌:  సూపర్‌ స్టార్‌ కృష్ణ సాహ‌సాలు, సంచ‌లనాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆయన అకాల మరణంతో దిగ్భ్రాంతికి గుర‌య్యాన‌ని పేర్కొన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ ప‌ద్మాల‌య స్టూడియోలో కృష్ణ పార్థివ దేహానికి ఆర్కే రోజా నివాళుల‌ర్పించారు. ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.  అనంతరం, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. సూపర్‌ స్టార్‌ కృష్ణ అద్భుతమైన వ్యక్తి. సాహసాలు, సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌. అందరూ ఇష్టపడే ఒకే ఒక్క హీరో కృష్ణ. ఆయన లేరు అంటే ఎవరూ కూడా జీర్ణించుకోని పరిస్థితి. 

సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కైన ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ లేకపోవడం తీరని పెద్దలోటు. నా చిన్నతనం నుంచి నేను కృష్ణకు అభిమానిని. ఆయన సొంత బ్యానర్‌లో నేను సినిమా చేయడం నా అదృష్టం. కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేది ఉంటుంది. ఇది కృష్ణను చూసి నేర్చుకోవాల‌ని రోజా వ్యాఖ్యానించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top