వైయ‌స్‌ జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం 

2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు 
 
 మంత్రి ఆర్కే రోజా

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టమ‌ని, ఆయ‌న‌కు కాద‌ని మంత్రి ఆర్కే రోజా స్ప‌ష్టం చేశారు. వైయ‌స్ జగన్ చరిష్మాతో మేమంతా ఎమ్మెల్యేలుగా గెలిచామ‌న్నారు. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు. ఇలాంటి రాజ‌కీయాలు చేసే చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు వైయ‌స్‌ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను కొన్న వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు. అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తెలుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు రాని వారు వెళ్ళారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తప్పవని ఆర్కే రోజా అన్నారు. 

Back to Top