మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందే

మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్  
 

అసెంబ్లీ: ప్రజలకు ఉపయోగపడని, అభివృద్ధికి అవరోధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిని శాశ్వతంగా రద్దు చేయాల్సిందేనని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానంపై మంత్రి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే సీఎం వైయస్ జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు.  వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణ కమిటీ ముఖ్యమైన సూచనలు చేసింది. శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు పట్టించుకోలేదు. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం  నారాయణ కమిటీ వేసి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు.  ఏపీ భవిష్యత్ కోసం అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా, కుర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్ గా చేయాలని సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. చంద్రబాబు చేసిన దురదృష్టకరమైన నిర్ణయాలను సరిచేసేందుకు సీఎం యత్నిస్తున్నారు. మండలిని రాజకీయ కేంద్రంగా టీడీపీ వినియోగించుకోవడం దురదృష్టకరం.  శాసన సభలో చేసిన చట్టాలకు సలహాలు, సూచనలు ఇవ్వకుండా..  టీడీపీ ఎమ్మెల్సీలు రాజకీయ కుట్రలకు వేదికగా చేసుకున్నారు.  మండలి రద్దును స్వాగతిస్తున్నాను. మండలిలో తీర్మానం మూవ్ కాలేదని ఛైర్మన్ స్వయంగా చెబుతున్నారు. అధికారాలు ఉన్నాయని చైర్మన్‌ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడం సబబా?.  ప్రజాసంపదను అన్ని ప్రాంతాలకు సమానంగా ఖర్చు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.  దళితుల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలను కూడా మండలిలో అడ్డుకున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి....  కానీ, రాష్ట్ర శ్రేయస్సు కోసం.. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం వాటిని కచ్చితంగా అమలు చేయాల్సిందే... లేకుంటే ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నాను. 

 

Back to Top