‘మా’ ఎన్నికలతో మాకు సంబంధం లేదు

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

తాడేపల్లి: చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న ‘మావీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు మంత్రి పేర్ని నాని వీడియో బైట్‌ను విడుదల చేశారు. ఆ ఎన్నికలతో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం, ఉత్సాహంగానీ లేవని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలలో ఏ వ్యక్తినీ, ఏ వర్గాన్నీ సమర్థించడం లేదు అని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top