మంత్రి వెల్లంపల్లిపై నిందలు వేయడం ధర్మం కాదు

వెల్లంపల్లిని రాజకీయంగా ఎదుర్కోలేక.. విషప్రచారాలు చేస్తున్నారు

సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజం

సచివాలయం: కనకదుర్గ గుడిలో ఏసీబీ సోదాలను కూడా కొందరు రాజకీయాలకు వాడుకోవాలని నీచ సంస్కారంతో ప్రయత్నాలు చేస్తున్నారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను టార్గెట్‌ చేసి కొందరు విషప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయంలో మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లిని రాజకీయంగా ఎదుర్కోలేక.. ఉద్దేశపూర్వకంగా దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 

దుర్గగుడిలో ఉన్న ఉద్యోగుల మీద అవినీతి నిరోధక శాఖ అధికారులతో వైయస్‌ జగన్‌ సర్కార్‌ సోదాలు చేయిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వమో.. యూఎన్‌ఓ నుంచో వచ్చి దాడులు జరుగుతున్నట్లుగా మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. ఎక్కడా అవినీతి జరగకూడదు.. అవినీతికి పాల్పడేవారిని ఉపేక్షించవద్దనేది సీఎం వైయస్‌ జగన్‌ ఉద్దేశమని, రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న సోదాల మీద.. రాష్ట్ర మంత్రిని దోషిగా చేయాలని తప్పుడు ప్రయత్నాలు చేయడం ధర్మం కాదన్నారు. దేవుడి పట్ల భక్తితో, చిత్తశుద్ధితో హైందవ సంప్రదాయాన్ని కాపాడాలని బతికే వెల్లంపల్లి శ్రీనివాస్‌పై ఇష్టానుసారంగా మాట్లాడి నిందలు వేయడం హేయమైన చర్యగా మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. 
 

Back to Top