బాబు అండతో పచ్చ మీడియా విషప్రచారం

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య

పచ్చపత్రికలు జర్నలిజం విలువలు దిగజార్చుతున్నాయి

అవినీతి రహిత పాలన అందించడమే సీఎం ధ్యేయం

రివర్స్‌టెండరింగ్‌లో రూ.750 కోట్లు ఆదా

ఒంటరిగా పోటీచేసి గెలిచిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీ చానళ్లు ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నాయని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పచ్చ మీడియా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. సీఎం వైయస్‌ జగన్‌ వెంట రాష్ట్ర ప్రజలు, పైన మంచి చేయాలనే భగవంతుడు ఉన్నాడన్నారు. పదేళ్లుగా ప్రజల కోసం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్‌ సీపీ చేసిన ప్రజా పోరాటాలు ఉన్నాయన్నారు. ఒంటరిగా పోటీ చేసిన వైయస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజలు 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒంటరిగా, 50 శాతం ప్రజల మద్దతుతో గెలిచిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలకు, సమస్యలకు పరిష్కార మార్గంగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించినవి నేడు ప్రభుత్వ పథకాలుగా రూపాంతరం చెందాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం వేగవంతంగా, అత్యంత పారదర్శకంగా జ్యూడీషియల్‌ ప్రీవ్యూ దగ్గర నుంచి ప్రతి పనిలో రూ. 10 లక్షల విలువ చేసే ప్రతి పనిలో రివర్స్‌టెండరింగ్‌ ప్రక్రియను ఏర్పాటు చేసిందన్నారు.

వైయస్‌ఆర్‌ సీపీ అంటే గిట్టని మీడియా ఎన్ని జోకులు వేసిన, ఎన్ని హాస్య కథనాలు రాసినా మా ప్రక్రియ, మా నాయకుడి పారదర్శక పాలనలో ఒక్క ఇరిగేషన్‌ టెండర్‌లోనే రూ.750 కోట్లు ఆదా చేసిందని మంత్రి పేర్ని నాని అన్నారు. గడిచిన ప్రభుత్వం జరిగిన లక్షల కోట్ల అవినీతి చేసిందన్నారు. కరకట్ట మీద ఉన్న ఇళ్ల నుంచి బస్తాల్లో జూబ్లీహిల్స్‌లోని కోటలోకి వెళ్లిందో అంచనా వేసుకోవచ్చన్నారు. పచ్చమీడియా చలోక్తులు, ఓర్వలేని తనంలో ఎన్ని కట్టుకథలు రాసినా.. సీఎం వైయస్‌ జగన్‌ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రజలకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నారో.. ప్రతి పనిని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నారన్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులందరూ హక్కుగా పొందాలని, లంచం ఇచ్చి కొనుగోలు చేయకూడదని సీఎం వైయస్‌ జగన్‌ చేసే ప్రయత్నం ఓర్వలేని తెలుగుదేశం పార్టీ అండదండలతో, ఆర్థికబలంతో నడిచే పత్రికలు, టీవీలు ఏరకంగా ప్రభుత్వంపై బురదజల్లాలి.. కట్టు కథనాలు, విషం చిమ్మే వార్తలు రాస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను మానసికంగా కుంగదీయాలి.. పాలన సజావుగా సాగకుండా ఉండాలని తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. ఇదేనా జర్నలిజం విలువలు.. ఉద్దేశపూర్వకంగా హాని చేసే కథనాలు రాయడం సమంజసమా అని ప్రశ్నించారు. గతంలో పేపర్‌ లీకేజీ అయ్యిందని తప్పుడు వార్త రాసిన బాబు అండతో నడిచే పత్రిక ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఆర్టీసీలో నూతన బస్సుల కొనుగోలుపై కూడా తప్పుడు వార్తలు రాసిందని మండిపడ్డారు.

Read Also: బాల్య వివాహాలను అరికట్టాలి

తాజా వీడియోలు

Back to Top