రామాయణంలోని రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు

తెలుగుదేశం పార్టీది శునకానందం

ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైయస్‌ జగన్‌ పవిత్రయజ్ఞం చేస్తున్నారు

కుట్రలు, కుతంత్రాలు నిండిన వ్యక్తి చంద్రబాబు

చంద్రబాబుదంతా రెండు కళ్ల సిద్ధాంతమే

శాసనమండలి రద్దుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

అసెంబ్లీ: యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా సీఎం వైయస్‌ జగన్‌ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతీ పనిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కౌన్సిల్‌లో అధికార వికేంద్రీకరణ బిల్లును అడ్డుకొని తెలుగుదేశం పార్టీ శునకానందం పొందుతుందన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం చేసిన బిల్లును 40 ఏళ్ల దిక్కుమాలిన అనుభవం కలిగి వికృత భావాలతో ఉన్న చంద్రబాబు శాసనమండలి చైర్మన్‌ను ప్రభావితం చేసి రూల్స్‌కు విరుద్ధంగా చేయించారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం, పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర భవిష్యత్తును కూడా చెరబట్టే వ్యక్తుల చేతుల్లో ఇలాంటి కార్యక్రమాలు నడపడం ఈ సమాజానికి నష్టం అని, తక్షణమే మండలి రద్దు పెట్టిన తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతున్నానన్నారు. అసెంబ్లీలో మంత్రి పేర్ని నాని ఏం మట్లాడారంటే.. ‘శాసనసభలో ఆమోదించిన చట్టానికి మరింత ప్రజాప్రయోజనం చేకూరేలా సూచనలు చేయాల్సిన బాధ్యత శాసనమండలిది. సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో చదువుతున్న పేదలందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో బోధన తీసుకువస్తే దాన్ని శాసనమండలిలో అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాల హక్కుల పరిరక్షణ మరింత కట్టుదిట్టం చేసేందుకు ఎస్సీ, ఎస్టీకి విడివిడిగా కమిషన్‌ ఏర్పాటు చేసి శాసనసభలో ఆమోదం తెలియజేస్తే కౌన్సిల్‌లో అడ్డుకున్నారు. పేదలకు మేలు జరగకూడదని చాలా మంది కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది నాటు భాషలో చెప్పాలంటే శునకానందంగా అభివర్ణించుకోవచ్చు. సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బాగు కోసం పవిత్ర యజ్ఞం చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుంది.

రామాయణంలో తాటకి, సుభాహు తల్లీ కొడుకులు ఉండేవారు. వారు ఎంతసేపూ.. లోక కల్యాణం కోసం మునులు యజ్ఞం చేస్తుంటే ఆ తాటకి, సుభాహు యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రక్తమాంసాలు వేసి విఫలానికి ప్రయత్నించేవారని విన్నాం. ఇవాళ పేదల కోసం సీఎం వైయస్‌ జగన్‌ యజ్ఞం చేస్తుంటే సభలో తల్లి తాటకి లాంటి చంద్రబాబు విషయం చిమ్ముతుంటే.. కౌన్సిల్‌లో సుభాహు లాంటి లోకేష్‌ మోకాలడ్డుతున్నాడు. దీన్ని మానసిక రుగ్మత, మానసిక వైకల్యం, మానసిక దౌర్భాగ్యం అనాలా..? వారి విచక్షణకే వదిలేస్తున్నాం..

శాసనసభ, శాసనమండలి నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా నడుస్తాయి. కానీ, కుట్రలు, కుతంత్రాలు, విషపూరిత ఆలోచనలతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న ప్రస్తుత టీడీపీ దుర్మార్గాలకు తెరతీస్తుంది. ముందు ఎన్నడూ లేని దుష్ట సంప్రదాయాలకు నాంది పలుకుతుంది. ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, అగ్రవర్ణ పేదలకు, అభివృద్ధి అందరికీ అందాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ను పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబుకు ధైర్యం, సాహసం, ధృడచిత్తం లాంటి గొప్ప లక్షణాలు జన్మతో వస్తే.. చంద్రబాబుకు మాత్రం పదవితో వస్తాయి. పదవితో పోతాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైయస్‌ జగన్‌ వైపు వేలు చూపించి జాగ్రత్త.. మీ అంతు చూస్తాను. మీ కథేంటో తేలుస్తాను.. తమశాలు చేస్తున్నారా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మొన్న నమస్కారం జగన్‌మోహన్‌రెడ్డి గారు అని మాట్లాడుతున్నాడు. ధైర్యం, తెగువ చంద్రబాబుకు అధికారం లేకుంటే ఉండదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా ధృడచిత్తంతో, ధైర్యంతో ప్రజల గురించి ఆలోచన చేయగలిగే దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 40 ఏళ్ల అనుభవం కేవలం చేతబడులకు  మాత్రమే వాడే అనుభవాన్ని.. 40 ఏళ్ల అనుభవం ఉపయోగించి ఎన్ని చేతబడులు చేసినా సీఎం వైయస్‌ జగన్‌ కాలు గోరు కూడా కదపలేరు.

శాసనమండలి గురించి చంద్రబాబు చాలా సుద్దులు చెబుతున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై ఎలా మాట్లాడారో (వీడియో వేసి చూపించారు). మండలి ఎంత అవసరం అని 2004లో చంద్రబాబు చెప్పారు. శాసనమండలి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిదని ఇవాళ మాట్లాడుతున్నారు. చంద్రబాబు జీవితం అంతా గమనిస్తే.. ప్రతీ నిర్ణయం యూటర్న్‌. మాట మాటకి పొంత ఉండదు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోనని మాట్లాడాడు. రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చాడు. విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరాడు. రెండు కళ్ల సిద్ధాంతంతో ప్రవర్తిస్తుంటాడు. తెలంగాణ, ఆంధ్రను కలిపేస్తా.. 40 ఏళ్ల అనుభవం ఉంది ఓటేయండి అని తిరిగాడు. వాజ్‌పేయి ప్రభుత్వం ఉంటే దాన్ని మత తత్వ పార్టీ, నేను మద్దతు ఇవ్వనని చెప్పాడు. తరువాత ఆ పార్టీతోనే జతకట్టాడు. మోడీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగాడు. ప్రత్యేక హోదా కావాలన్నాడు.. ఎన్నికల తరువాత ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వమని అడిగాడు. నాలుగేళ్లు అయిపోయిన తరువాత ప్యాకేజీ వద్దు హోదా కావాలని యూటర్న్‌ తీసుకున్నాడు. మోడీని తిడతాడు.. ఎన్నికలు అయిపోయిన తరువాత కాళ్లు పట్టుకుంటాడు. రాహుల్‌ గాంధీని తిడతాడు.. మళ్లీ పొగుడుతాడు.

పత్రికారంగం దుర్మార్గ పోకడలు పోవడం చాలా హేయం. నీటిలో మునిగిపోతున్న చేపను సాహసంతో రక్షిస్తున్న పాము అని రాస్తున్నారు. బాధ్యతలు లేకుండా పత్రికలు ప్రవర్తించడం దుర్మార్గం. గడిచిన ఎన్నికల ముందు చంద్రజ్యోతి, డ్రామానాడు ఎంత విషయం చిమ్మినా కూడా ప్రజలు విశ్వాసంతో ఉవ్వెత్తున ఎగసే విజయాన్ని అందించారు. సీఎం వైయస్‌ జగన్‌పై ప్రజలకు ఉన్న ప్రేమను ఏ మాత్రం తగ్గించలేరు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రాజధానులు తీసుకురావాలని ఆలోచన చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి టీడీపీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్థం కావడం లేదు. చంద్రబాబు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చేసిందేమీ లేదు. సాగునీరు కూడా అందించలేని పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. మండలిలో మొన్న జరిగిన దుస్సంఘటనలు రూల్స్‌ ప్రకారం జరిగాయా అంటే ప్రశ్నార్థకమే. భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న విశాల సంకల్పాన్ని 40 ఏళ్ల దిక్కుమాలిన అనుభవం కలిగి వికృత భావాలతో ఉన్న ఒక వ్యక్తి.. మండలి చైర్మన్‌ను ప్రభావితం చేసి రూల్స్‌కు విరుద్ధంగా చేయించారు. రాజకీయ లబ్ధి కోసం, పైశాచిక ఆనందం కోసం రాష్ట్ర భవిష్యత్తును కూడా చెరబట్టే వ్యక్తుల చేతుల్లో ఇలాంటి కార్యక్రమాలు నడపడం ఈ సమాజానికి నష్టం. తక్షణమే మండలి రద్దు పెట్టిన తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతున్నాను.

Back to Top