రేకుల షెడ్‌కు 8 కోట్లు ఖర్చా..!

చట్టాలపై చంద్రబాబుకు గౌరవం లేదు..

రవాణా,సమాచార,ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని

 

అమరావతి:అక్రమ నిర్మాణమని తెలిసినా గత ప్రభుత్వం ప్రజాధనం వృధా చేసిందని రవాణా,సమాచార,ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.చంద్రబాబు తన అక్రమ నివాసాన్ని కాపాడుకోవాలనే ప్రజావేదిక నిర్మించారన్నారు. తన అక్రమానికి ప్రజావేదికను అడ్డం పెట్టుకున్నారన్నారు.చట్టాలంటే చంద్రబాబుకు ఏ మాత్రం గౌరవం లేదన్నారు.ఎన్జీటీ నిబంధనలపై చంద్రబాబు ఏనాడు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు.ప్రజావేదికలో విలువైన పరికరాలను మళ్లీ వాడుకునేందుకు తరలించామని తెలిపారు.సాధ్యమైనంత వరుకు నష్టాన్ని తగ్గించేలా చూస్తున్నామన్నారు.ప్రజావేదిక నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని ఇక్కడ చూస్తే రేకుల షెడ్‌ కనిపిస్తోందన్నారు.

తాజా వీడియోలు

Back to Top