ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే దుష్ప్రచారం

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాం

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలో ఎక్కడా అవకతవకలు జరిగే అవకాశమే లేదన్నారు. పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామన్నారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణను అన్ని మీడియా సంస్థలు ప్రశంసించాయన్నారు. ప్రశ్నాపత్రం అసలు బయటకు వెళ్లే అవకాశమే లేదు. కొందరు కావాలని పనిగట్టుకొని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top