తిరుపతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న బస్సు యాత్ర ఈ నెల 27వ తేదీన ప్రారంభమవుతుందని పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. తిరుపతి లో "మేమంతా సిద్దం" సమన్వయ సమావేశం పెద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వచ్చే నెల 3, 4వ తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్దం సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం సమన్వయకర్తలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. అనంతరం సిద్దం సభ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నారంటే.. ఈనెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం. మార్చి 30న గుత్తిలో బహిరంగ సభ ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2,3 తేదీల్లో బస్సుయాత్ర. మూడో తేదీన సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సుయాత్ర. తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3,4 తేదీల్లో మేము సిద్ధం సభలు.